F2 నుండి “సర్కారు వారి పాట” వరకు… “రాశీ ఖన్నా” రిజెక్ట్ చేసిన 10 సూపర్‌హిట్ సినిమాలు..!

F2 నుండి “సర్కారు వారి పాట” వరకు… “రాశీ ఖన్నా” రిజెక్ట్ చేసిన 10 సూపర్‌హిట్ సినిమాలు..!

by Anudeep

Ads

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్లు బిజీ షెడ్యూల్ వల్ల గానీ కథ నచ్చక కానీ తమ వద్దకు వచ్చిన మూవీస్ ని రిజెక్ట్ చేయడం కామన్. అయితే.. అందులో కొన్ని సినిమా హిట్ అవుతే.. కొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి.

Video Advertisement

‘ఊహలు గుస గుస లాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఢిల్లీ భామ రాశీ ఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 8 సంవత్సరాలు పూర్తవుతుంది.

ఈ 8 ఏళ్ళలో రాశీ ఖన్నా.. బెంగాల్ టైగర్, సుప్రీమ్, తొలి ప్రేమ, ప్రతి రోజూ పండగే వంటి హిట్ సినిమాల్లో నటించగా.. హైపర్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు వంటి కొన్ని ఫ్లాప్ లు కూడా పలకరించాయి. అయితే రాశీ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం . .

#1.ఎఫ్ 2

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2 సూపర్ హిట్ మూవీలో మొదట మెహ్రీన్ పాత్రలో రాశీ ఖన్నాని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి నో చెప్పింది.

#2. మజిలీ

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం రాశిఖన్నాను సంప్రదించారు. కానీ రాశి నో చెప్పడంతో దివ్యాంశ కౌశిక్ ను ఎంపిక చేసారు.

#3.రాక్షసుడు

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ ‘రాట్ససన్’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కూడ రాశి మిస్ చేసుకుంది.

#4. మానాడు

శింబు హీరోగా నటించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ కళ్యాణి ప్రియదర్శన్ కి వచ్చింది.

#5. సర్కారు వారి పాట

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకుడు. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా మొదట రాశీ ఖన్నాని అనుకున్నారు. ఇతర కారణాలతో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు.

#6.మహానుభావుడు

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం కోసం మొదట రాశీ ఖన్నాని సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల మెహ్రీన్ కు ఈ అవకాశం దక్కింది.

#7.టక్ జగదీష్

శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా రాశీ ఖన్నాని సంప్రదించారు. కానీ ఆమె ఈ ఆఫర్ కు నో  చెప్పింది.

#8. మహా సముద్రం

శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటించిన ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా రాశీ ఖన్నాకి అవకాశం వచ్చింది. కానీ ఎందుకో రాశీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.

#9. గీత గోవిందం

geeta govindam

 

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. నిజానికి మొదట రాశీ ఖన్నాని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె అవకాశాన్ని వదులుకుంది.

#10. భూమి

జయం రవి హీరోగా నటించిన ఈ మూవీలో మొదట హీరోయిన్ గా రాశీ ఖన్నాని అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా ఆఫర్ ను వదులుకుంది.

అనేక కారణాల వల్ల కొన్ని సినిమాలు వదులుకున్నప్పటికీ త్వరలో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది రాశీ ఖన్నా. అలాగే ‘సర్దార్’ ‘యోదా’ ‘సైతాన్ క బచ్చా’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తోంది.

ఎన్టీఆర్ తో తప్పా ఇతర టాప్ హీరోలతో ఇప్పటివరకు రాశీ నటించలేదు. ఇక ముందైనా రాశీ ఆచితూచి అడుగులు వేస్తుందేమో వేచి చూడాలి.


End of Article

You may also like