Ads
ప్రతి సినిమాకి అందులో నటించిన వాళ్లే మొదటి ఛాయిస్ అవ్వాలి అని రూల్ లేదు. డేట్ల సమస్య కారణంగానో, లేదా ఇంకేదైనా కారణంగానో ముందు ఒకరికి కథ చెప్పడం తర్వాత వాళ్ళు ఆ సినిమా చేయలేకపోవడం అనేది ఇండస్ట్రీలో చాలా సాధారణం.
Video Advertisement
అందుకే ఇంటర్వ్యూలలో ఆ సినిమాలో నటించలేకపోయిన నటులు కొన్ని కారణాల వల్ల తాము ఆ సినిమాలను చేయలేకపోయాము అని బహిరంగంగానే చెప్తారు. దర్శకులు కూడా తాము వేరే నటులకు ముందు కథ వినిపించిన విషయాన్ని అంతే బహిరంగంగా చెప్తారు. అలా కొంత మంది నటులు చేయలేకపోయిన, లేదా రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 రకుల్ ప్రీత్ సింగ్
గీత గోవిందం
ఈ సినిమాలో మొదట రకుల్ ప్రీత్ సింగ్ నటించాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరక రకుల్ ఈ సినిమా చేయలేకపోయారు.
#2 సూర్య
బిజినెస్ మాన్
బిజినెస్ మాన్ సినిమా కోసం మొదట సూర్యని సంప్రదించారు.
#3 శర్వానంద్
అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాలో మొదట హీరోగా శర్వానంద్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల శర్వానంద్ ఈ సినిమా కథని రిజెక్ట్ చేశారు.
#4 పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
అతడు
పోకిరి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
#5 ప్రభాస్
ఆర్య
డైరెక్టర్ సుకుమార్ మొదట ఆర్య కథని ప్రభాస్ కి వినిపించారు.
#6 మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.
24
ఏ మాయ చేసావే
ఫిదా
పుష్ప
జనగణమన
#7 రవితేజ
పోకిరి
మొదట పోకిరి కథని రవితేజకి వినిపించారు.
#8 ఎన్టీఆర్
ఊపిరి
మొదట ఊపిరి ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఈ సినిమా చేయలేకపోయారు అని సమాచారం.
#9 వెంకటేష్
కృష్ణం వందే జగద్గురుమ్
రానా దగ్గుబాటి హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో మొదట హీరో వెంకటేష్ ని అనుకున్నారు.
#10 రామ్ చరణ్
ఎటో వెళ్ళిపోయింది మనసు
నాని హీరోగా నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా కథ మొదట గౌతమ్ మీనన్ రామ్ చరణ్ కి వినిపించారు.
#11 సుమంత్
సుమంత్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.
తొలిప్రేమ
నువ్వే కావాలి
#12 అనుపమ పరమేశ్వరన్
రంగస్థలం
రంగస్థలంలో మొదటి హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని అనుకున్నారు. చివరి నిమిషంలో అనుపమ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ స్థానంలో సమంత నటించారు.
#13 అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.
భద్ర
గీత గోవిందం
#14 సమంత
పుష్ప
పుష్ప సినిమాలో కూడా మొదట శ్రీవల్లి పాత్రకి సమంతని సంప్రదించారు. కానీ తర్వాత ఈ పాత్రని రష్మిక చేశారు.
అలా మన స్టార్ హీరో హీరోయిన్స్ వదులుకున్న కొన్ని సినిమాలు ఇవే.
End of Article