Ads
సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు మొదలవ్వడం, ఆగిపోవడం లేదా ఒక యాక్టర్ ని వేరే వాళ్లు రిప్లేస్ చేయడం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోతాయి. కొన్ని ఎనౌన్స్ చేయకముందు సినిమా గురించి వార్తలు వస్తున్నప్పుడే ఆగిపోతాయి. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత రూమర్స్ కూడా అంతే సహజం. అలా ఇద్దరు స్టార్ల గురించి ఒక వార్త ప్రచారం అయ్యింది. అదేంటంటే.
Video Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్స్ లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఇంకా శ్రీదేవి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఈ ఒక్క సినిమా మాత్రమే కాకుండా ఎస్పీ పరశురామ్, రాణికాసుల రంగమ్మ తో పాటు ఇంకా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అయితే, వీరిద్దరూ కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరికి ముందే ఇంకా కొన్ని సినిమాల్లో నటించాల్సి ఉందట.
వాటిలో ఒకటి “వజ్రాల దొంగ”. కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా రూపొందిద్దామని అనుకున్నారు. ఇందులో, హీరోయిన్ గా శ్రీదేవిని అనుకున్నారు. ఈ సినిమాని శ్రీదేవి నిర్మిస్తాను అని చెప్పారట, దానితో పాటు కథలో కూడా కొన్ని మార్పులు చేయాలని అడగడంతో, అది కుదరకపోవడంతో ఈ సినిమా షూటింగ్ స్టేజి వరకు రాలేదు అనే వార్తలు వినిపించాయి.
అంతే కాకుండా కొండవీటి దొంగ సినిమాకి ముందు శ్రీదేవి ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ టైటిల్ లో కొండవీటి రాణి అని యాడ్ చేయమని, తన పాత్రలో కూడా కొన్ని మార్పులు చేయమని అడగడంతో, అది కూడా కుదరకపోవడంతో శ్రీదేవి సినిమా నుంచి తప్పుకున్నారు అని,
ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవి హీరోగా, రాధా, విజయశాంతి హీరోయిన్లుగా కొండవీటి దొంగ సినిమాని తెరకెక్కించారు అనే వార్తలు కూడా వచ్చాయి.
అలాగే, అసలు ముందు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా టైటిల్ కేవలం జగదేకవీరుడు అనుకున్నారు అని, కానీ తర్వాత శ్రీదేవి అడగడంతో జగదేకవీరుడు అతిలోకసుందరి గా మార్చారు అనే వార్త ఒకటి ప్రచారం అయ్యింది. ఈ విషయాల గురించి ఈ సినిమాలకి సంబంధించిన వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి అవి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కానీ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.
End of Article