Ads
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి అకాల మరణంతో ఇండస్ట్రీలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటు కారణంగా శ్రీనివాసమూర్తి చెన్నైలో తన తుది శ్వాసను విడిచారు. ఆయన మరణం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలను కలచి వేసింది. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో శ్రీనివాసమూర్తి తన సేవలను అందిస్తూ వచ్చారు. తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎందరో స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
Video Advertisement
ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయనెవరో చాలా మందికి తెలీదు. కానీ ఈ మధ్య కాలం లో ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో ఆయన చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వల్లనే ఆయన పేరు లైమ్ లైట్ లోకి వచ్చింది. సినిమాలోని పాత్రలకు తగ్గట్టుగా తన గొంతులో కూడా వేరియేషన్ చూపిస్తూ, తన డైలాగ్ డెలివరీతో ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్నారు శ్రీనివాసమూర్తి.
అయితే డబ్బింగ్ అంటే కేవలం డైలాగ్ లు చెప్పడం మాత్రమే కాకుండా.. ఎన్నో వేరియేషన్స్ చూపిస్తూ ఈ రంగం లో తనదైన ముద్ర వేశారు శ్రీనివాస మూర్తి. ముఖ్యంగా సూర్య, విక్రమ్ లకు ఆయన డబ్బింగ్ సూపర్ హిట్ అయ్యింది. కేవలం ఆయన డబ్బింగ్ చెప్పడం వల్లే హిట్ అయిన చిత్రాలు ఉన్నాయి అంటే నమ్మక తప్పదు. ఇప్పుడు ఆ చిత్రాలేవో చూద్దాం..
#1 సింగం సిరీస్
తమిళ హీరో సూర్య కి తెలుగులో భారీ ఫాలోయింగ్ తెచ్చిన చిత్రాలు సింగం సిరీస్ లు. ఈ చిత్రాలన్నిటికి శ్రీనివాస మూర్తిగారు డబ్బింగ్ చెప్పారు.
#2 అపరిచితుడు
విక్రమ్ ని స్టార్ హీరో చేసిన చిత్రం అపరిచితుడు. ఆ చిత్రం లో విక్రమ్ మూడు పాత్రలకి మూడు వేరియేషన్స్ చూపిస్తూ డబ్బింగ్ చెప్పారు శ్రీనివాస్.
#3 తెగింపు
తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగు చిత్రాలన్నిటికి శ్రీనివాస్ నే డబ్బింగ్ చెప్పారు. ఇటీవల వచ్చిన తెగింపు చిత్రానికి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు.
#4 ఐ
దర్శకుడు శంకర్, విక్రమ్ కలయికలో వచ్చిన మరో చిత్రం ఐ కి కూడా శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
#5 సఖి
దర్శకుడు మణిరత్నం, మాధవన్ కాంబినేషన్ లో వచ్చిన సఖి చిత్రం ఎంత సూపర్ హిట్టో మనకి తెల్సిందే. అందులో మాధవాన్ఫ్ పాత్రకి కూడా శ్రీనివాస్ నే డబ్బింగ్ చెప్పారు.
#6 24
సూర్య హీరోగా వచ్చిన 24 చిత్రం లో కూడా సూర్య పాత్రకి డబ్బింగ్ చెప్పారు శ్రీనివాస్.
#7 జనతా గ్యారేజ్
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం లో మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మోహన్ లాల్ పాత్రకి శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
#8 అల వైకుంఠపురం
త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అల వైకుంఠపురం చిత్రం లో కీలకపాత్ర పోషించిన నటుడు జయరాం పాత్రకి శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
#9 గరుడవేగా
హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగా చిత్రం లో ఆయన పాత్రకి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
#10 ఐరన్ మాన్, జేమ్స్ బాండ్
హాలీవుడ్ మూవీస్ ఐరన్ మాన్, జేమ్స్ బాండ్ వంటి చిత్రాలకు కూడా శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
#11 హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజ సజ్జ హీరోగా వస్తున్న చిత్రం హనుమాన్. ఈ పాన్ వరల్డ్ మూవీ ట్రైలర్ కి కూడా శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
ఇవే కాకుండా బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌ల పాత్రలకు సైతం శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పారు.
End of Article