Ads
సమస్యలకు లింగభేదం ఉండదు. అయితే సమస్యలను ఎదుర్కొనే ధోరణి మాత్రం అందరిలో ఒకేలా ఉండదు. మన సమాజంలో ఆడవాళ్లు, మగవాళ్లకు వేర్వేరు రకాల సమస్యలు ఎదురవుతాయనే మైండ్ సెట్ ముందు నుంచి ఉంది. కానీ అది తప్పు.
Video Advertisement
ఆ సమస్యలు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కాదు. ఇంటా బయట కూడా వారికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
కుటుంబసభ్యుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసే మహిళలు చాలా మందే ఉన్నారు. మళ్లీ ఒకసారి తన జీవితాన్ని అనుభవించగలిగితే ఎంత బాగుండేది అని ఆలోచన ప్రతి ఒక్క అమ్మలోనూ, అమ్మాయిలోనూ ఉంటుంది. అలాగే అమ్మాయిలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలనే కథగా ఎంచుకుని కొందరు దర్శకులు సినిమాలు తీశారు. వాటి ప్రభావంతో ఎంత మంది మారారో తెలియదు కానీ.. ప్రతి అమ్మాయి మాత్రం అలాంటి మార్పునే కోరుకుంటుంది. అయితే ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 ఫిదా
శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన తీసే ప్రతి సినిమాలోనూ అమ్మాయి పాత్రకు కచ్చితంగా విలువ ఉంటుంది. ఇక ఫిదా విషయానికి వస్తే.. ఈ చిత్రం లో ” ఓ చోట పుడతాము.. పెరుగుతాం.. పెళ్లి చేసుకుంటాం.. యాడికో వెళ్లిపోతాం. అంతే కదా నువ్వైనా నేనైనా.. అసలు అమ్మాయిలు ఎందుకు వెళ్లాలి నాన్న. ఈ రూల్ ఎవడు పెట్టాడో కానీ.. చాలా మోసం ఇది.” అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్‌కి చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు. అవును నిజమే. అమ్మాయే ఎందుకు పెళ్లిచేసుకుని వేరే వాళ్ల ఇంటికి వెళ్లాలి అనే ఆలోచన ప్రతిఒక్కరిలోనూ మెదిలేలా చేసింది ఈ ప్రశ్న.
#2 డియర్ కామ్రేడ్
మంచి సున్నితమైన కంటెంట్ ఉన్న సినిమా. ఓ అమ్మాయి తనకు ఇష్టమైన క్రీడారంగంలో రాణించాలి అనుకుంటే.. అక్కడ తనకు ఎదురయ్యే సెక్సువల్ హెరాజ్మెంట్ల గురించి.. ఈ సినిమాలో చూపించారు.
#3 పెళ్లి చూపులు
చదువు పూర్తైన కూతుళ్లకు పెళ్లి చేయాలనే ఆలోచన తప్పా మరో ఆలోచన లేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో. కూతురు ఉందనే సంతోషం ఏ మాత్రం లేకుండా.. కొడుకు లేడని బాధపడేవారికి ఓ చక్కని జవాబు ఈ సినిమా.
#4 సమ్మోహనం
అమ్మాయి తనకు నచ్చిన రంగంలో రాణించాలని చూస్తుంటే.. ఇంట్లో వాళ్లే అడ్డుపడటం సహజమే. ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు చాలా తక్కువ. పైగా సినిమాలు అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇదే కాన్సెప్ట్‌తో హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దారు. పైగా నటన ఏదో తప్పు అన్నట్లు అమ్మాయిని కట్టడి చేస్తారు.
#5 ఓ బేబీ
కడుపున పుట్టిన బిడ్డతో ఒంటరి మహిళగా.. తన ఇష్టాలను చంపుకుని వాడి కోసమే తన జీవితం ధారబోసిన ఓ మహిళ కథ ఇది. భర్త తోడు లేకపోయినా.. భర్త లేడని దగ్గరకు వచ్చే రాబందుల్లాంటి మనుషుల నుంచి తప్పించుకుని.. ఎమోషనల్ పాత్ర ఇది.
#6 సైజ్ జీరో
ఒక అమ్మాయి ఎదుర్కొనే ప్రధాన సమస్య బరువు. అమ్మాయిలు ఏ కారణంతో అయినా బరువు పెరుగుతారు. అది ఒత్తిడి వల్ల కావొచ్చు, థైరాయిడ్ వల్ల కావొచ్చు, హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కావచ్చు. ఇలా చాలా సమస్యలతో బరువు పెరిగిపోతుంటారు. ఇదే వారి పాలిట శాపంలా భావిస్తారు ఇంట్లోని తల్లిదండ్రులు. అమ్మాయి లావు ఉంటే పెళ్లి కాదని భయపడుతూ.. అమ్మాయిని మెంటల్ టార్చర్ పెడ్తారు. అలాంటి వారికి ఈ సినిమా ఓ చక్కని సమాధానం ఇస్తుంది.
#7 మహానటి
ఈ చిత్రం లో జర్నలిస్ట్ గా నటించిన సమంత పాత్రకి ఆమె తండ్రి ఒక బైక్ ఇవ్వడానికి ఎన్నో ఆంక్షలు పెడుతూ ఉంటారు. పెళ్లి చేసుకొనే వాళ్ళకి ఎందుకమ్మా బైక్ లు. ఒక వేళ కింద పడితే పెళ్లి జరగదు అంటూ ఉంటారు. అమ్మాయిల జీవితానికి పెళ్లి తప్ప ఇంకో దారి లేదు అన్నట్లు చూపించారు.
#8 ఆనంద్
శేఖర్ కమ్ముల సూపర్ హిట్ చిత్రం ఆనంద్ లో కూడా హీరోయిన్ పాత్రకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఒక ఒంటరి ఆడపిల్లకి సమాజం లో ఎదురయ్యే సమస్యల గురించి ఇందులో చర్చించారు.
#9 అమ్ము
ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో వచ్చిన అమ్ము చిత్రం లో ప్రధానంగా డొమెస్టిక్ వయోలెన్స్ గురించి చూపించారు.
#10 అమ్మ రాజీనామా
జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాలలో ఇది తొలివరుసలో ఉంటుంది.
#11 9 నెలలు
ఒక సరోగేట్ మదర్ ఈ సమాజం లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అన్న విషయాలను ఈ చిత్రం లో చర్చించారు.
#12 కౌసల్య కృష్ణమూర్తి
ఒక పల్లెటూరి నుంచి వచ్చిన యువతీ తన కాలనీ నిజం చేసుకోవద్దని ఎన్ని కష్టాలు పడింది అన్న విషయాలను ఈ మూవీ లో వివరించారు.
#13 మహానటి
ఒక భార్య సక్సెస్ ని భర్త భరించలేక.. ఆమెని మోసం చేస్తే ఆ మోసాన్ని చరించలేక ఆమె ఎన్ని ఇబ్బందులు పడింది అన్న విషయాన్ని ఈ మూవీ లో చూపించారు.
#14 లవ్ స్టోరీ
చిన్నప్పుడే వేధింపులకు గురైన ఒక అమ్మాయి జీవితం పై దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈ మూవీ లో చర్చించారు.
#15 ఆమె
చిన్న వయసులోనే భర్తని ని కోల్పోయిన ఒక యువతి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అన్న విషయాన్ని ఈ చిత్రం లో చూపించారు.
End of Article