Ads
ఫిబ్రవరి నెల చాలామందికి స్పెషల్. ఆ నెలలో వచ్చే ప్రేమికుల దినోత్సవం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త వాళ్లు ఫిబ్రవరి 14న తమ లవర్ కి ప్రపోజ్ చేస్తారు. అప్పటికే ప్రేమలో ఉన్నవారు లేదా భార్యాభర్తలు ఫిబ్రవరి 14న ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 14 ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు దీని కన్నా ఏడు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. రోజ్ డే తో ప్రారంభమై వాలెంటైన్స్ డే తో ఆ వేడుకలు ముగుస్తాయి.
Video Advertisement
అయితే ఆ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారితో సంతోషంగా గడిపేందుకు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. అయితే ఆ రోజున ప్రేమికులందరు ఖచ్చితంగా చూడాల్సిన చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 టైటానిక్
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన టైటానిక్ మూవీ సినిమా ప్రియులందరికీ ఫేవరేట్ మూవీ. భాషాబేధం లేకుండా అందరికి ఈ చిత్రం నచ్చింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. వాలెంటైన్స్ డే రోజు చూడటానికి ఈ చిత్రం మంచి ఛాయస్.
#2 దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే. ఈ చిత్రం మీ ప్రియమైన వారితో చూసేందుకు మంచి చిత్రం.
#3 తొలిప్రేమ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో మనకి తెల్సిందే. ఈ చిత్రం ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ మూవీ.
#4 లవ్ టుడే
ఇక ఇటీవల విడుదలైన చిత్రాల విషయానికి వస్తే మోడరన్ కాలం లో లవ్ ఎలా మారిందో ఈ చిత్రం లో క్లియర్ గా చూపించారు. ఇందులో ప్రదీప్ రంగనాథం, ఇవానా జంటగా నటించారు.
#5 సీతారామం
హను రాఘవపూడి దర్శకత్వం లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన చిత్రం సీతారామం. ఈ చిత్రం ఇటీవల కాలం లో ది బెస్ట్ స్టోరీ గా చెప్పొచ్చు.
#6 తిరు
ధనుష్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన చిత్రం తిరు. ఈ చిత్రం కూడా వాలెంటైన్స్ డే కి మంచి ఆప్షన్.
#7 హృదయం
మళయాళ చిత్రం హృదయం కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్, దర్శన రాజేంద్రన్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రల్లో నటించారు.
End of Article