Ads
సినిమా చూసినంతసేపు తరువాత వచ్చే సన్నివేశం ఎలా ఉంటుందో అనే ఆసక్తి కలిగించకపోతే ఆ మూవీ విజయం సాధించలేదు. అదే విధంగా క్లైమాక్స్ ఊహించినట్లు ఉన్నా, ఏ మాత్రం ఆసక్తిగా లేకపోయినా, ఆ సినిమా ప్లాప్ అయినట్లే.
Video Advertisement
అందువల్ల సాధ్యమైనంత వరకు క్లైమాక్స్ లో శుభం కార్డు పడే ముందు ప్రేక్షకులని ఆశ్చర్యపరచడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో చాలామంది డైరెక్టర్లు విజయం సాధించారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొన్ని చిత్రాలను విజయం సాధించేలా చేశాయి. ట్విస్ట్ తో ముగిసిన సినిమాలలో టాప్ 13 సినిమాలను ఇప్పుడు చూద్దాం..1. పోకిరి:
తెలుగు సినిమా ప్రేక్షకులకు కదిలించిన క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాలలో ముందుగా ఉండేది పోకిరి మూవీ. కృష్ణమనోహర్ IPS అనే మాట ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
2. అ మూవీ:
“అ” సినిమాలోని అన్నీ పాత్రలు, వాళ్ల కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ లో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ట్విస్ట్ అందరికి షాక్ ఇచ్చింది.
3. రంగస్థలం:
అప్పటి వరకు ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి ఏ అస్సలు విలన్ అని అనుకునే ఆడియన్స్ కి అతను కాదు ఇంకో విలన్ ఉన్నాడు అని రివీల్ చేసే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది.
4. బాహుబలి: ద బిగినింగ్:
ఈ మూవీలో క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ రెండవ పార్ట్ రిలీజ్ అయ్యేవరకు ప్రశ్నగానే మిగిలింది. అమరేంద్ర బాహుబలిని ఎవరు చంపారని శివుడు ప్రశ్నించగా, తానే బాహుబలిని చంపానని కట్టప్ప చెప్పడంతో మొదటి భాగం ముగుస్తుంది.
5. అనుకోకుండా ఒక రోజు:
మత్తులో ఉన్న హీరోయిన్ ఆ రోజు ఏం చేసింది అనేది క్లైమాక్స్ లో జగపతి బాబు రివీల్ చేస్తారు.
6. క్షణం:
అన్నసూయ మెయిన్ విలన్ అనే ట్విస్ట్ సరిపోలేదు, చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చారు. సత్యదేవ్ అసలైన విలన్ అని రివీల్ చేస్తారు.
7. గూఢచారి:
చివర్లో హీరో తండ్రి మరణించలేదని అతనే ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడనే విషయం కథను మలుపు తిప్పుతుంది.
8. కేర్ అఫ్ కంచెరపాలెం:
ఇక కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో ప్రతి క్యారెక్టర్ మరియు పోరాట ప్రతి కథకి ఇట్టే కనెక్ట్ అవుతాయి. కానీ క్లైమాక్స్‌లో దర్శకుడు ఆ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కరే అని ఇచ్చిన ట్విస్ట్ ఊహించనిది.
9. కుమారి 21F:
జైలు నుండి వచ్చిన హీరో కుమారిని పెళ్ళి చేసుకుంటాడు. పోలీసులు వెతుకుతున్న అతని ముగ్గురు ఫ్రెండ్స్ ను పట్టుకోలేక పొలీసులు కేసుని ముసివెయ్యాలని చుస్తారు. కానీ వారిని 3 ఏళ్లుగా హీరోనే సంకెళ్ళతో బంధించి ఉంచాడని క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారు.
10. ప్రస్థానం:
సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ క్లైమాక్స్ కారణంగా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
11. మిస్సమ్మ:
భూమిక మిస్సమ్మగా అందరిని ఆకట్టుకుంది. చివరి వరకు ఒక శాడిస్టిగా చూపించి, క్లైమాక్స్ లో ఆమె అనారోగ్యాన్ని చెప్పిన తీరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
12. నేనొక్కడినే:
నాజర్ రోల్ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి పాజిటివ్ గా చూపించి క్లైమాక్స్ లో అసలైన విలన్ గా చూపించడం అనే ట్విస్ట్ ఆశ్చర్య పరుస్తుంది.
13. జెంటిల్ మెన్:
ఈ మూవీలో చివరి వరకు నాని నే విలన్ గా కనిపించగా, క్లైమాక్స్ లో అతను విలన్ కాదని, వంశీ అని ట్విస్ట్ ఇస్తారు.
Also Read: “అంటే అది..!” అంటూ… “బాహుబలి ప్రొడ్యూసర్” ఇచ్చిన కౌంటర్ కి రాజమౌళి రిప్లై..! ఏం అన్నారంటే..?
End of Article