Ads
ప్రతి వారంలాగే ఈ వారం అరడజను పైగా చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యాయి.వాటిలో విరాన్ ముత్తంశెట్టి నటించిన ‘ముఖ్య గమనిక’ సినిమా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావమరిది (అల్లు అర్జున్ మేనమామ కొడుకు) విరాన్ ముత్తంశెట్టి ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : ముఖ్య గమనిక
- నటీనటులు : విరాన్ ముత్తం శెట్టి, లావణ్య, ఆర్యన్ కృష్ణన్, భాషా తదితరులు.
- నిర్మాత : రాజశేఖర్, సాయికృష్ణ
- దర్శకత్వం : వేణు మురళీధర్.వి
- సంగీతం : కిరణ్ వెన్న
- విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2024
స్టోరీ:
సదాశివపేటలో పోలీస్ స్టేషన్ లో పనిచేసే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొడుకు విరాన్(విరాన్ ముత్తంశెట్టి). అతని తండ్రి ఊహించని విధంగా హత్య చేయబడతాడు. తండ్రి మరణంతో ఆ జాబ్ విరాన్ కి వస్తుంది. విరాన్ డ్యూటీలో చేరగానే పురుషోత్తం మిస్సింగ్ కేసు వస్తుంది. ఆ మిస్సింగ్ కేసులో అతని భార్య అపూర్వను విచారిస్తాడు.
ఆమె తన లైఫ్ లోకి వచ్చిన ఇషాన్ గురించి, అతని మరణం గురించి చెప్తుంది. పురుషోత్తం మిస్ అయిన రోజే వీరన్ తండ్రి చనిపోతాడు. విరాన్ తండ్రి ఎలా మరణించాడు? పురుషోత్తం మిస్ అవడం వెనుక ఉన్నది ఎవరు? అపూర్వ లైఫ్ లోకి వచ్చిన ఇషాన్ ఎవరు? ఇషాన్ చనిపోవడం వెనుక రహస్యం ఏంటి? పోలీసుల అనుమానాస్పద చావులు మరియు అదృశ్యాలకు కారణం ఏమిటనేది మిగిలిన కథ.
రివ్యూ:
దర్శకుడు రాసుకొన్న స్టోరీ బాగుంది. ఆ స్టోరీలో ట్విస్టులు, డీల్ చేసిన తీరు మెప్పించేలా ఉంది. అయితే బరువైన క్యారెక్టర్లకు ప్రేక్షకులకు తెలియని నటులను ఏమిక చేసుకోవడంతో తేలిపోయాయి. సినిమాలోని వారంతా కొత్తవారే అవడంతో పాత్రల్లో ఉండే భావోద్వేగాలను పూర్తిగా పండించలేకపోయారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, కిరణ్ వెన్న అందించిన సంగీతం ఒకే. కొన్ని సీన్స్ ను బీజీఎం ఎలివేట్ చేసింది. రాజశేఖర్, సాయికృష్ణ అనుసరించిన నిర్మాణ విలువలు ఒకే. కొత్తనటీనటులతో ప్రయోగం చేయకుండా కాస్త పేరు ఉన్నవారితో మూవీ తీసి ఉంటే, ఇంకా మంచి ఫలితం వచ్చేదనిపించింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే, వీరన్ ముత్తంశెట్టికి తొలి సినిమా అయినప్పటికీ, విరాన్ గా మెప్పించేందుకు ప్రయత్నం చేశాడు. లావణ్య, పురుషోత్తం, అపూర్వ, ఇషాన్, తమ పాత్రల మేరకు నటించారు. విలన్‌గా నటించిన చిత్రం బాషా తన క్యారెక్టర్ కు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు.
ప్లస్ పాయింట్స్:
- కథ
- విరాన్ ముత్తంశెట్టి పర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్
- ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోవడం
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్:
నటీనటులు కొత్తవారైనా, ఈ మూవీ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి వారికి నచ్చే ఛాన్స్ ఉంది.
watch trailer :
End of Article