బాలయ్య తో మూవీ చేస్తున్న టైం లో కోమాలోకి.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ముమైత్ ఎందుకు ఇండస్ట్రీ ని వీడింది..?

బాలయ్య తో మూవీ చేస్తున్న టైం లో కోమాలోకి.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ముమైత్ ఎందుకు ఇండస్ట్రీ ని వీడింది..?

by Anudeep

Ads

ముమైత్ ఖాన్.. ఈ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాట. ఈ పాట పోకిరి సినిమాలోది. ఒంపు సొంపుల్తో కుర్ర కారుని కట్టిపడేసిన ముమైత్ ఖాన్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో దాదాపు యాభై కి పైగా సినిమాలలో నే నటించింది. ప్రస్తుతం ఆమె “డాన్స్ ప్లస్” షో లో కూడా జడ్జి గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక రకం గా ముమైత్ రీ ఎంట్రీ ఇచ్చినట్లే. చాలా కాలం ముమైత్ ఇండస్ట్రీ కి దూరం గా ఉంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

mumaith feature

ఇటీవల, ముమైత్ ఖాన్ “అలీ తో సరదాగా” షో కి వచ్చింది. ఈ సందర్భం గా ఆమె పలు ఆసక్తికర విషయాలను అందరితో పంచుకుంది. ఈ షో లో అలీ అడుగుతూ పాపులర్ అయ్యాక కొమ్ములేమైనా వచ్చాయా అని అడిగితె, అలాంటిదేమి లేదని, నా రూపం వలన జనాలేదో అనుకుంటారని, నాకేమి తలపొగరు లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక టైం లో బాగా తగ్గిపోయావు. తలకి ఎదో దెబ్బ తగిలిందని, ఆపరేషన్ అయిందని వార్తలు కూడా వచ్చాయి.. అసలేమి జరిగింది అని అలీ అడిగాడు.

mumaith khan

దానికి ముమైత్ ఏమందంటే..” బాలయ్య గారు డిక్టేటర్ మూవీ చేస్తున్న టైం లో, ఆ సినిమా లో నేను ఓ డాన్స్ చేసాను. ఆ డాన్స్ చేస్తున్న టైం లోనే కాలు జారీ వెనక్కి పడ్డాను. ఆ పడేటప్పుడు తల కార్నర్ కు కొట్టుకుంది. బాగా గట్టి గా తగలడం తో కోమా లోకి వెళ్ళిపోయా.. దాదాపు పదిహేను రోజులు కోమాలోనే ఉండిపోయాను.

mumaith feature

పడిన తరువాత, రెండు రోజులు బ్రెయిన్ నుంచి రక్తం కారుతూనే ఉందట. కనీసం.. మూడేళ్లయినా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెప్పారు. కానీ, 3 నెలలకే నేను పని చేయడం మొదలు పెట్టేసాను” అంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకుని ముమైత్ కన్నీరు పెట్టింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఇలా జరిగింది. అందుకే ముమైత్ సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.


End of Article

You may also like