Ads
విజయ్ దేవరకొండ ఈ పేరు వింటే ఈ మధ్య కుర్రకారు గుండెల్లో సెగ్ పుట్టుకొస్తుంది. తను ఏ సినిమా తీసినా, ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకపోయినా తను అలవరుచుకున్న మ్యనరిజం తో అందరినీ ఆకట్టుకుంటాడు. పెళ్లి చూపులు నుండి లైగర్ వరకు ఒక్కో కొత్త కథనం, స్టైల్ తో అభిమానులకి చేరువ అవుతుంటాడు.
Video Advertisement
ఇక విజయ్ సినిమాల్లో పాటలు అయితే కచ్చితంగా అందరి ఫోన్లల్లో రింగ్టోన్ అయ్యి మోగాల్సిందే. ఇకపోతే రాష్మీక మందన్న సరసన నటించిన గీతా గోవిందం సినిమాలో… హీరోయిన్ కి సారి సారి అని అని చెప్పినట్టు. ఇప్పుడు విజయ్ దేవరకొండకు కూడా ఒక మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్ దిగొచ్చి సారి సారి విజయ్ అంటూ, క్షమాపణ చెప్పాడు.
watch video:
అసలు ఏం అయ్యిందంటే, లైగర్ ప్రమోషన్స్ అప్పుడు బాయ్ కాట్ గ్యాంగ్ కు సంబంధించి విజయ్ కొన్ని కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లను ముంబైకు చెందిన, ఫేమస్ మరాఠా మందిర్ థియేటర్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ మనోజ్ దేశాయ్ తప్పుగా అర్థం చేసుకున్నారట. దాంతో విజయ్ ను దుమ్మెత్తి పోశారు. అసలు అతనికి పద్దతి పాడు లేదని, ఎలా మాట్లాడాలో తెలీదని, గర్వం ఎక్కువ అని ఇలా ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇటీవల ఆ మాటలు అన్నింటినీ వెనక్కి తీసుకుంటూ, విజయ్ కి సారీ చెప్పారు.
watch video:
I expect our #Bollywood stars should learn something from @TheDeverakonda
Humbleness is the key to success. Keep going Vijay! #VijayDevarakonda #ManojDesai pic.twitter.com/76xZnSyVIO
— Ravi Gupta (@FilmiHindustani) August 28, 2022
అసలు ఇప్పటి వరకూ తాను ఏ హీరోకి సారీ చెప్పలేదు. అప్పుడు అమితాబ్ బచ్చన్ కి, ఇప్పుడు నీకు చెప్తున్నా అన్నారట. నిజానికి నువ్వు మాట్లాడిన మాటలను నేను తప్పుగా అర్థం చేసుకున్నా విజయ్, కానీ నువ్వు అందరి గురించి సెట్ లో కూడా అందరూ గురించి ఆలోచించే వాడివి అని అర్థం చేసుకున్నాను అంటూ విజయతో ముచ్చటించారు. దీనికి విజయ్ స్పందిస్తూ… అయ్యయ్యో సర్ మీరు చాలా పెద్దవారు, నేను ఎన్ని చోట్లకు వెళ్ళినా, మీలాంటి పెద్ద వారి ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చాను. మీరు అలా సారీ చెప్పకండి అంటూ జవాబిచ్చాడు. ఇక అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపారు.
ఇదంతా చూస్తుంటే అర్థమయ్యింది ఏంటంటే… ఒక వైపు కష్ట పడిన తర్వాత విజయం సాధించడంతో… విమర్శలు కూడా పొగడ్తలుగా మారుతాయని. అందుకే ఎప్పుడూ ఎవరనీ ఏమి అనకూడదని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ డిస్ట్రిబ్యూటర్ నిజంగానే మనస్పూర్తిగా తప్పు ఒప్పుకున్నారా? లేకా భవిష్యత్తులో విజయ్ తో లాభం చేకూరుతుందని, బిజినెస్ మైండ్ తో ఆలోచించి సారీ చెప్పారా అనే కోణంలో పలు ఆలోచనలు వెల్లువవుతున్నాయి.
మరో వైపు విజయ్ చూపించిన వినయం చూస్తుంటే కూడా, మొదట ఆయన అన్న మాటలకు బాధ అయ్యి ఉండొచ్చు కానీ, పెద్ద మనిషి సారీ చెప్పే సరికి విజయ్ కి కూడా ఇబ్బందిగా అనిపించింది అని తెలుస్తోంది. అందుకే చిన్న వాడు అయినా పెద్ద మనసుతో, ఆ పెద్ద మనిషి మాటలను నవ్వుతూ గౌరవంగా స్వీకరించాడు.
ఏది ఏమైనా సినీ పరిశ్రమలో, విమర్శలు పొగడ్తలు చాలా కామన్. విమర్శించారు అని దోషించ కూడదు. పొగిడారు అని గర్వంగా ఫీల్ అవ్వకూడదు. గెలుపు అయినా, ఓటమి అయినా ఒకేలా స్వీకరించగలగాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అనమాట.
End of Article