ఈ కర్ఫ్యూ లో నా గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కలవాలి అంటూ నెటిజెన్ కొంటె ప్రశ్న.. కూల్ రిప్లై ఇచ్చిన ముంబై పోలీసులు..!

ఈ కర్ఫ్యూ లో నా గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కలవాలి అంటూ నెటిజెన్ కొంటె ప్రశ్న.. కూల్ రిప్లై ఇచ్చిన ముంబై పోలీసులు..!

by Anudeep

Ads

ప్రస్తుతం దేశమంతా కరోనా ఉద్ధృతి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.. మహారాష్ట్ర లో దేశం లో అన్ని రాష్ట్రాల కంటే హెచ్చు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముంబై లో పరిస్థితి మరీ దారుణం గా ఉంది. ఈ క్రమం లో ముంబై లో కూడా కర్ఫ్యూ అమలు లో ఉంది. అయితే.. ఈ పరిస్థితి లో ఓ ప్రేమికుడు తన గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కలవాలి అంటూ పోలీసులను ప్రశ్నించాడు.

Video Advertisement

color stickers 1

దానికి ముంబై పోలీసులు కూడా కూల్ గా రిప్లై ఇచ్చారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటి అంటే.. కర్ఫ్యూ టైం లో కేవలం అత్యవసరమైన సేవలకు మాత్రం పోలీసులు అనుమతులు ఇచ్చారు. అంబులెన్స్, వైద్యులు, మీడియా, ఫార్మసీ, వాక్సిన్ సిబ్బంది, డయాగ్నోస్టిక్ సెంటర్లు … ఇలా అవసరమైన వారికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే.. వీరి వాహనాలను గుర్తించడానికి వీలుగా… వారి వాహనాలపై కలర్డ్ స్టిక్కర్స్ ను అంటిస్తూ వస్తున్నారు.

color stickers 2

నిత్యావసరాల వస్తువులు తీసుకొచ్చే వాహనాలకు గ్రీన్ స్టిక్కర్లు, అంబులెన్స్, డాక్టర్లు, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రెడ్ స్టిక్కర్లు, మీడియా, మునిసిపాలిటీ, ప్రభుత్వ వాహనాలు వంటి వాటికి యెల్లో కలర్ స్టిక్కర్లను అంటిస్తూ వస్తున్నారు. అత్యవసరం కాకుండా.. ఎవరు బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమం లో ఓ ప్రేమికుడు.. తనకు తన గర్ల్ ఫ్రెండ్ ను కలవాలని ఉందని.. అందుకు ఏ కలర్ స్టిక్కర్ వేసుకోవాలని డైరెక్ట్ గా పోలీసులనే అడిగాడు.

color sticker 3

అందుకు వారు..” మీకు ఈ విషయం ముఖ్యమైనదే కావచ్చు. కానీ.. మా అత్యవసరాల జాబితా లో ఇది లేదు. కాబట్టి.. మీరు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. దూరం మనసుని మరింత విశాలం చేస్తుంది. మీరు ప్రస్తుతం ఆరోగ్యం గా ఉన్నారు.. అలానే.. మీరిద్దరూ జీవితాంతం కలిసుండాలని మేము కోరుకుంటున్నాం..” అంటూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ అయింది. ముంబై పోలిసుల సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

ఇది కూడా చదవండి : బాహుబలి 2 సినిమాను ఇన్ని సార్లు చూసాం.. కానీ ఈ 30 తప్పుల్ని ఎప్పుడైనా గమనించారా..?


End of Article

You may also like