మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఇస్లాపూర్ కి చెందిన మురళీకాంత్ పెట్కార్ చిన్న వయసులోనే భారత సైన్యం లో సేవలందించేందుకు సైనికుని గా జాయిన్ అయ్యారు. 1965 సంవత్సరంలో జరిగిన యుద్ధం సమయంలో అయినా చాలా తీవ్రంగా గాయపడ్డారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఒక విజిల్ వినిపించిందని అది టీ తాగే సమయం కావడం వల్ల అందరు అది టీ విజిల్గా భావించారని కానీ అది శత్రువులు వస్తున్నారని తెలియడానికి హెచ్చరిక కోసమని వారికి అర్థమయ్యే లోపే శత్రువులు వారిపై దాడి చేశారు ఆ దాడిలో కొంతమంది సైన్యాధికారులు చనిపోయారని తనకి బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకుపోతుందని మరికొన్ని బుల్లెట్లు వెనుకభాగంలోనికి చాచ్చుకుపోయాయి అని,తనపై నుండి వాహనం వెళ్ళిపోయింది, తను కొండపై నుండి క్రిందకి పడిపోయానని తెలియజేశారు.

శస్త్రచికిత్స తర్వాత రెండు సంవత్సరాలు తను ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చిందని తరువాత శరీర వ్యాయామం కోసం స్విమ్మింగ్ ప్రారంభించానని తెలిపారు. యుద్ధంలో ఆయన ఎంతో నష్టపోయినప్పటికి ధైర్యాన్ని కోల్పోకుండా మరింత పట్టుదలతో 1972లో జరిగిన పారా ఒలింపిక్స్ లో పాల్గొని ప్రిస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్ లో భారత్ కు మొదటి పసిడి పథకాన్ని తీసుకు వచ్చారు. ఇప్పటికీ ఒక బుల్లెట్ తన శరీరంలోనే ఉందని తన కంటికి కూడా శస్త్ర చికిత్స జరిగిందని అయినప్పటికీ ఆయన ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అని తెలియజేశారు. భారతదేశానికి స్వర్ణ పతకం తీసుకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వివరించారు