ఈ ఫోటోలో తన గురువు గారితో ఉన్న ప్రముఖ సంగీతకారుడు ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో తన గురువు గారితో ఉన్న ప్రముఖ సంగీతకారుడు ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

పాట అనేది లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. భాషలు వేరేగా ఉంటాయి. పాటల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అయినా కూడా అందరూ సంగీతాన్ని ఇష్టపడతారు. సంగీతంలో శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం ఉంటాయి. అన్ని రకాల పాటలని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంత మంది ఏదో ఒక రకమైన పాటలు మాత్రమే వింటారు. ఏదేమైనా పాటలు మాత్రం వింటూనే ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీతాన్ని అభివృద్ధి చేయడంలో కొంత మందిది మాత్రం చాలా ముఖ్యపాత్ర ఉంది. ఇప్పుడు అంటే ఎంతో మంది సింగర్లు వచ్చారు. కానీ గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు.

Video Advertisement

musician in this image

కేవలం కొంత మంది సింగర్స్ మాత్రమే ఉండేవారు. వారే ప్రతి సినిమాలో హీరోకి తగ్గట్టుగా పాటలు పాడుతూ ఉండేవారు. ఈ పైన ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత అభివృద్ధికి పెద్ద మెట్టు వేశారు. ఈ ఫోటోలో తన గురువు గారితో ఆ వ్యక్తి ఉన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అయినని అందరూ ఘంటసాల అని కూడా అంటారు. ఒక గొప్ప సంగీతకారుడు. పాటలు బాగా పాడడంతో పాటు, బాగా స్వరపరుస్తారు కూడా. ఏ హీరో పాట పాడినా కూడా ఆ హీరో కి తగ్గట్టుగానే పాడటం ఘంటసాల గారి ప్రత్యేకత. ఈ ఫోటోలో ఘంటసాల గారు తన గురువు గారు అయిన పాట్రాయిని సీతారామ శాస్త్రి గారితో ఉన్నారు.

కుర్చీలో కూర్చున్న వ్యక్తి పాట్రాయిని సీతారామ శాస్త్రి గారు. కింద కూర్చున్న వారిలో కుడివైపు నుండి రెండవ వారు ఘంటసాల గారు. ఈ ఫోటో విజయనగరం సంగీత కళాశాలలో ఘంటసాల గారు చదువుకునే రోజుల్లో తన సహ విద్యార్థులతో కలిసి, తన గురువు గారితో పాటు ఘంటసాల గారు దిగిన ఫోటో. ఈ ఫోటోని కోరాలో వెంకటరమణ సూరంపూడి గారు షేర్ చేశారు. గుడివాడలో ఉన్న చౌటపల్లిలో ఘంటసాల గారు పుట్టారు. ఘంటసాల గారు విజయనగరంలో ఉన్న మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ లో చేరారు. ఆ సమయంలో తీసుకున్న ఫోటో ఇది.


End of Article

You may also like