Ads
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులో సోషల్ మీడియా యాప్స్లో యాక్టివ్ గా ఉండాల్సిందే . నేడు చాలామంది ధోరణి ఇలాగే ఉంది . దానికి సెలబ్రిటీలేం మినహాయింపు కాదు . వాట్సప్ , ఫేస్బుక్ , టిక్ టాక్ , ఇన్స్ట్రాగ్రాం మరియు ట్విటర్ ఇలా ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి . వాటిల్లో డెయిల్ ఎన్నో అప్డేట్స్ . దేన్నైనా సరిగా వాడకపోతే చిక్కులు తప్పవు . ఫలితంగా సైబర్ కేసులు . తాజాగా ఇలాంటి పరిస్థితే ఒక యువనటికి ఎదురైంది.
Video Advertisement
సరవనన్ మీనాక్షి , కలక్కపోవత్తు యారు , కళ్యాణం ముదాల్ కాదల్ వారై వంటి తమిళ సీరియల్స్ తో క్రేజ్ సాధించిన నటి మైనా నందిని . తన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాప్స్లో అప్డేట్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల మైనా నందిని పేరుతో ఒక ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అందులో ఒక ఫోన్ నంబర్ ని కూడా యాడ్ చేసింది . ఇక్కడే అసలు సమస్య వచ్చింది .
ఆ కాంటాక్ట్ నంబర్ మైనా నందిని ది కాదు . ఈరోడ్ జిల్లా, అందియూర్ సమీపంలోని అన్నామలై గ్రామానికి చెందిన గురునాథన్ అనే వ్యక్తి ది . దీంతో గురునాథన్ కి నందిని కావాలంటూ క్షణం తీరిక లేకుండా వరుసగా ఫోన్లు వస్తున్నాయి . అసలు తన నెంబర్ ఎలా అందరికి తెలిసింది అని వాకబు చేస్తే, చివరకు నటి మైనా నందిని ఆమె ఫేస్‌బుక్‌లో తన ఫోన్ నంబర్‌ని ఇచ్చిందని తెలుసుకున్నాడు . ఫోన్ల తాకిడి తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి వివరాలు చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశాడు.
నందిని తన వ్యక్తిగత ఫేస్‌బుక్ అకౌంట్‌లో చేసిన తప్పుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నందిని కావాలనే ఈ తప్పుడు నెంబర్ పోస్ట్ చేసిందా? లేదా మిస్టేక్‌లో అలా జరిగిందా? లేదంటే నందిని పేరుతో మరెవరైనా నకిలి అకౌంట్ ఓపెన్ చేశారా అనే తదితర వివరాలు తెలియాల్సి ఉంది . ఏదైతేనేం ఒక తప్పు వల్ల గురునాధన్ ఇబ్బంది పడాల్సి వచ్చింది , దాని ఫలితంగా ఇప్పుడు నందిని కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది.
End of Article