ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకోసం కొత్త కారు వస్తుంది కదా…మీరెందుకు టైర్ మారుస్తున్నారు.? కలెక్టరమ్మ ఆన్సర్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకోసం కొత్త కారు వస్తుంది కదా…మీరెందుకు టైర్ మారుస్తున్నారు.? కలెక్టరమ్మ ఆన్సర్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

by Anudeep

Ads

కలెక్టర్ అంటే ఓ పెద్ద స్థాయి ఉద్యోగం.. ఎవరైనా సరే ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, ఒకసారి ఆ స్థాయి కి వచ్చేసాక చాలా మంది లెవెల్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు. నేను కలెక్టర్ ని.. నా స్థాయి కి ఈ పనులేంటి అన్నట్లు చాలా మంది బిహేవ్ చేస్తారు. కానీ మైసూర్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి మటుకు ఇందుకు పూర్తి గా డిఫరెంట్.. ఆమె ఎవరో.. ఆమె స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం..

Video Advertisement

మైసూరు కలెక్టర్ రోహిణి సింధూరి గత శనివారం వారాంతపు సెలవు కావడం తో బయటకు వచ్చారు. అయితే, ఆమె కారు టైర్ పంక్చర్ అయింది. ఆమె స్కార్పియో ఎస్‌యూవీ వాహనానికి టైర్ పంక్చర్ అయితే.. ఆమె స్వయం గా టైర్ ను మార్చుకున్నారు. ఆమె టైర్ ను మారుస్తున్న సమయం లో దారిన వెళ్లే ఓ వ్యక్తి మేడం.. మీరు కలెక్టర్ రోహిణి సింధూరి కదా..? మీరెందుకు టైర్ మారుస్తున్నారు.. ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకోసం కొత్త కారు వస్తుంది కదా.. అని అడిగితే.. “నాకు ఊరి సమస్యలే కాదు.. నా కారు సమస్యలు కూడా పరిష్కరించుకోవడం తెలుసు” అంటూ ఆమె నవ్వుతు బదులిచ్చారట.

అక్కడ స్థానికులు ఆమె నిజాయితీ కి, నిరాడంబరత కు ముగ్ధులవుతున్నారు. ఓ వ్యక్తి ఆమె టైర్ మారుస్తున్న సమయం లో వీడియో ను తీసి నెట్టింట్లో పెట్టారు. సాధారణం గా ఆమె ఏమైనా చేయగలిగే అధికారం ఉండి కూడా నిజాయతీ గా వ్యవహరించారు. దీనితో, ఆమెకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె టైర్ మారుస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ సాధారణ అమ్మాయి కూడా తన కారు టైర్ తాను మార్చుకోలేదేమో.. కానీ, అంత హోదా ఉండి కూడా నిరాడంబరం గా వ్యవహరిస్తున్న ఈ యువ కలెక్టర్ వ్యక్తిత్వానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

watch video:


End of Article

You may also like