కని పెంచిన అమ్మ కోసం ఏదైనా చేయొచ్చు. తన పిల్లల భవిష్యత్తు  కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని  త్యాగం చేసి, వాళ్ల కోసమే ప్రాణం పెట్టె మాతృమూర్తి కోసం ఏదైనా చేయొచ్చు. ఇక అటువంటి తల్లి  కోసం ఒక కుమారుడు చేసిన పని ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఆ తనయుడు తలలో కోసం ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. అతను తన మాతృమూర్తి కోసం లక్షకు పైగా వేతనం వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్ ని విడిచిపెట్టాడు. అతను అలా ఎందుకు చేశాడు అంటే ఆయన తల్లి రత్నమ్మ కలలను తీర్చడం కోసం. అయితే  కృష్ణ కుమార్ అలాంటి  నిర్ణయం తీసుకుంటాడని  ఎవరూ ఊహించలేదు. తల్లిదండ్రులు ఇద్దరు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.  వారి కలలు తీరే సమయానికి  భర్త మరణంతో రత్నమ్మ తన కల ఇక పై తీరదని అనుకున్నారు. కానీ తన తల్లి కల గురించి తెలియగానే కృష్ణ కుమార్ తల్లి  కోరికను ఎలాగైనా తీర్చాలని భావించాడు.
అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు.  ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి  గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై  దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు. కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా  బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా  దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. Also Read: పెళ్లి జరిగిన తర్వాత అత్తారింటికి వెళ్ళను అని కారులో నుండి దిగిపోయింది..! వరుడికి ఆ సమస్య ఉండడంతో..?