Ads
Nadendla Manohar: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్ పర్సన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విధంగా నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు జనసేన పార్టీ మహిళలను నేతలను కూడా విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈయనని అరెస్టు చేయడం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Video Advertisement
విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ కూడలి తెరవాలి అంటూ నోవాటేల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు అయితే ఈ ఆందోళనను అడ్డుకోవడం కోసం పోలీసులు నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరిని కూడా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టు కావడంతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తక్షణమే వారిని విడుదల చేయకపోతే తాను వెంటనే విశాఖ బయలుదేరుతాను అంటూ ఈయన పోలీసులకు హెచ్చరించారు. ఆయనని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసి వేయడం ఏంటని ఈయన ప్రశ్నించారు.
కేవలం విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ కోసం వాస్తు దోషం కారణంగా ఈ కూడలి మూసేయడం దారుణమని ఇలా ఈ జంక్షన్ మూసివేయడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సుమారు రెండు కిలోమీటర్ల మేర అధికంగా ప్రయాణం చేయాల్సి వస్తుందని వెల్లడించారు. మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు,వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు.
మనోహర్ అలాగే ఇతరులను వెంటనే విడుదల చేయాలని ఈయన పోలీసులను సూచించారు అలా కాని పక్షంలో తాను ఇప్పుడే విశాఖకు బయలుదేరుతాను అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తాము శాంతియుతంగా ధర్నాలు చేస్తే అరెస్టు చేయడం మంచిది కాదని నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ విషయంపై ఉన్నతాధికారులు ఆలోచించాలని ఆ డివైడర్ తొలగించే వరకు మేము మా పోరాటం ఆపము. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
End of Article