నదియా అంటే పవన్‌ అత్త లేదా ప్రభాస్ అమ్మ మాత్రమేనా..? ఎందుకలా రాస్తున్నారు?

నదియా అంటే పవన్‌ అత్త లేదా ప్రభాస్ అమ్మ మాత్రమేనా..? ఎందుకలా రాస్తున్నారు?

by Anudeep

మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన నదియాని చూడగానే చాలామంది ఫిదా అయ్యారు, ఆ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అనుష్క,రిచా ఇద్దరి కన్నా నదియానే బాగుందనే కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి..అదే ఏడాది పవన్ చిత్రం అత్తారింటికి దారేదిలో పవన్ అత్తగా నటించి తన అందంతో,నటనతో మార్కులు కొట్టేశారు.ఇంతవరకు బానే ఉంది .కాని నదియా అంటే కేవలం ప్రభాస్ తల్లి, పవన్ అత్తనేనా.. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే చాలా వెబ్సైట్స్ అలాగే రాస్తున్నాయి మరి.

Video Advertisement

నదియా , వయసు యాభైమూడేళ్లు .. ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ .. తన అసలు పేరు జరీనా మొయిదు, సినిమాల్లోకి వచ్చాక నదియాగా మారింది. ఎప్పుడూ అంటే ఈ వెబ్ సైట్స్ ఇవేవి లేని కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్ .మొదటి సినిమాకే మళయాలి స్టార్ మోహన్ లాల్ సరసన ఛాన్స్ కొట్టేసింది . మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. 1984-88 వరకు ఇండస్ట్రీలో తన హవా కొనసాగించింది. తర్వాత పెళ్లి చేసుకుంది..పెళ్లి తర్వాత కూడా రెండు మూడేళ్లు సినిమాల్లో నటించి, తర్వాత యూఎస్ వెళ్లిపోయి సెటిల్ అయిపోయింది.

నదియా పెళ్లి చేసుకున్నది శిరీష్ గోడబెలే, అతను ఇన్వస్ట్మెంట్ బ్యాంకర్. నదియా  ఆ రోజుల్లోనే యుఎస్ లో మాస్ కమ్యునికేషన్లో డిగ్రీ, మీడియా మేనేజ్మెంట్ కోర్సులు చదివింది..లండన్లో ఉంది కొన్నాళ్లు..ఇప్పుడు ఇవన్ని ఎందుకు అంటే ఒక నటిని పరిచయం చేయాలనుకుంటే ముందు తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపుని తెలుసుకోవాలి. వాళ్లకంటూ ఒక గుర్తింపు ఉంటుంది.అది గుర్తించాల్సిన అవసరం ఉంది.అదొదిలేసి ప్రతిసారి ఎవరో ఒక స్టార్ హీరో పేరుంటే తప్ప వీళ్లకి గుర్తింపుండదు అనే ధోరణి వదిలేస్తే బాగుంటుంది.

ఎవరో ముక్కుముఖం తెలియని నటులకి ఇలా వాడినా, సరే వారికి అదొక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. అంతేకాని ఆల్రెడీ స్టార్ అయిన నటీమణులకు కూడా ఇలాంటి తోకలు తగిలించడం ఎంతవరకు కరెక్ట్ . నదియా మాత్రమే కాదు ఇలా ఎందరో నటిమణులకి హీరోల పేర్లు యాడ్ చేసే టైటిల్స్ ఉంటాయి.. నటి సోనాలి బింద్రే గురించి రాయాల్సి వస్తే – మహేశ్ భామ సోనాలి..మురారి వచ్చి ఇన్నేళ్లైనా సోనాలి ఇంక మహేశ్ భామేనా? సోనాలి మహేశ్ భామ అయితే, మరి నేనెవర్ని అని నమ్రత అడిగితే? జాగ్రత్త మరి..


You may also like

Leave a Comment