“ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు..!” అంటూ… విడాకులపై స్పందించిన నాగ చైతన్య..!

“ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు..!” అంటూ… విడాకులపై స్పందించిన నాగ చైతన్య..!

by Anudeep

Ads

‘ఏ మాయ చేశావే’ సినిమాలో జంటగా నటించిన అక్కినేని నాగచైతన్య, సమంత నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు. ఏ మాయ చేసావేతో పరిచయం అయ్యి.. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు సమంత, నాగ చైతన్య. అయితే పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే తమ వైవాహిక జీవితాన్ని ముగించిన సమంత, నాగచైతన్య విడాకుల అంశం ఈ మధ్య మళ్లీ తెరపైకొచ్చింది.

Video Advertisement

ఇటీవల కాఫీ విత్ కరణ్ జోహార్ టాక్ షోలో విడాకులపై సమంత స్పందించడంతో మరొక్కసారి వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత పలుమార్లు స్పందించినప్పటికీ, నాగచైతన్య మాత్రం మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

కానీ.. తాజాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ ప్రమోషన్స్ కోసం జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంలో నాగచైతన్యను సమంతతో విడాకుల గురించి మరోసారి విలేకరులు ప్రశ్నించారు. తన విడాకులపై వివాదాలకు దూరంగా ఉండాలని మొదటి నుంచి భావిస్తున్న నాగ చైతన్య తాజాగా కూడా అలాగే స్పందించారు. నేషనల్ మీడియా విడాకుల గురించి అడగ్గా..

“మంచైనా, చెడైనా తాను మీడియాకు సమాచారం ఇచ్చే జీవితంలో ముందుకెళ్లానని” చెప్పాడు. “విడాకుల తర్వాత సమంత మరో ముందడుగు వేసిందని, తాను కూడా తన పని తాను చేసుకుంటూ సాగిపోతున్నానని” వెల్లడించాడు. “అంతకు మించి ఈ ప్రపంచానికి తానేం చెప్పాలనుకోవడం లేదని” నాగ చైతన్య స్పష్టం చేశాడు. తన స్నేహితులు, కుటుంబం, తన చుట్టూ ఉన్న వాళ్లందరికీ విషయం నేనెంటో తెలుసని చెప్పాడు.

“ఇప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి. తర్వాత వేరే విషయంపై వార్తలు వస్తాయి. ఇప్పుడు జరిగే విషయాలు తాత్కాలికంగానే వార్తల్లో నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ఎంత ఎక్కువగా స్పందిస్తే అంత ఎక్కువ వార్తలు వస్తాయి. కాబట్టి నేను వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఏది జరగాలో అదే జరుగుతుంది తర్వాత ఈ విషయంపై చర్చ కూడా తగ్గిపోతుంది” అభిప్రాయపడ్డాడు. తన వ్యక్తిగత జీవితం గురించి చైతన్య మాట్లాడుతూ, “నా వ్యక్తిగత జీవితం నా వృత్తి జీవితాన్ని ప్రభావితం చేయని విధంగా నన్ను నేను నిర్మించుకున్నాను. కాబట్టి, వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు..” అంటూ విడాకులపై నాగ చైతన్య ఈ విధంగా స్పందించారు.

అంతే కాకుండా ఇదే విషయంపై మాట్లాడుతూ మరొక ప్రశ్న అడిగారు. “సోషల్ మీడియా అనేది మీ వ్యక్తిగత జీవితాలను కూడా బయట పెట్టే ఒక ప్లాట్‌ఫామ్. ఇది మీకు చిరాకు తెప్పిస్తుందా?” అని మీడియా అడగ్గా.. అందుకు నాగ చైతన్య ఈ విధంగా చెప్పారు. “నేను నటుడిగా ఇక్కడ ఉన్నాను. నా వృత్తి జీవితం గురించే మాట్లాడాలని కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం చర్చనీయాంశం కావడం నాకు ఇష్టం లేదు. నా వృత్తి పరమైన విషయాలు కాకుండా నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం చిరాకు తెప్పిస్తోంది. కానీ నేను నా వృత్తిపై మరింత కష్టపడి పనిచేయాలి అనుకుంటున్నట్టు” నాగ చైతన్య మీడియాకు సమాధానమిచ్చారు.

WATCH VIDEO:


End of Article

You may also like