నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్…..స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అంటే…

నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్…..స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అంటే…

by Mounika Singaluri

Ads

అక్కినేని నాగచైతన్య ఈ యువ హీరో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ ఆడియన్స్ ను  అలరిస్తూ ఉంటారు.హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను సంతోషపెడతారు.

Video Advertisement

అయితే ఇప్పుడు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టుగా ఆయన కూడా ఓటిటి కంటెంట్  బాట పట్టారు.ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ధూత ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.

dhootha naga chaitanya

ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ డైరెక్టర్ విక్రమ్  కుమార్ డైరెక్ట్ చేశారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. మనం సినిమా సూపర్ హిట్ కాగా, థాంక్యూ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడోసారి వీరిద్దరూ కాంబోలో వచ్చిన చిత్రమే ధూత.ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్ లుగా రూపొందించారు. ఇందులో సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య నటించారు. ఆయన రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు. తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.

ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ డిసెంబర్ ఒకటో తారీకు నుండి ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడు ధూత, నాగచైతన్య హాష్ టాగ్స్ నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తరికెక్కించినట్లు దర్శకుడు తెలియజేశారు.ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంటే భవిష్యత్తులో నాగచైతన్య మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం ఉంది. ఎప్పుడు కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన తెలియజేశారు.

 

Also Read: “OG అప్‌డేట్ ఇవ్వురా..?” అని అడిగిన నెటిజన్ కి… DVV టీమ్ ఇచ్చిన రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!


End of Article

You may also like