Ads
దాదాపుగా సంవ్సతరం నుంచి వాయిదా పడుతూ వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. కరోనా మహమ్మారి కారణంగా పలు సార్లు ఇప్పటికే వాయిదా పడి ఎట్టకేలకు థియేటర్స్ తెరుచుకోగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేసారు నిర్మాతలు. హిట్ టాక్ సొంతం చేసుకుని నాగ చైతన్య, సాయి పల్లవి నటనలకి ముగ్దులైన ప్రేక్షకులు థియేటర్స్ కి బ్రహ్మ రథం పట్టారు.
Video Advertisement
ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో గులాబీ తుఫాన్ ని సైతం లెక్క చెయ్యకుండా దూసుకెళ్తుంది సినిమా. బ్రేకేవెన్ దాదాపుగా వచ్చేసినట్టే. ఫుల్ రన్ లో సుమారు యాభై కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. నిన్న జరిగిన సక్సెస్ మీట్ కి చిత్ర యూనిట్ తోపాటుగా నాగ చైతన్య తండ్రి ‘నాగార్జున’ గారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమానికి.
ఈ సందర్బంగా నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ఎన్నో కొత్త విషయాలని నేను తెలుసుకున్నాను ఈ సినిమా విడుదలతో మన జర్నీ ఇక్కడితో ఆగిపోతుందని బాధ పడ్డానని చెప్పారు. తన ప్రతి సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకులనుంచి, క్రటిక్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఉండేవాడినని కరోనా వలన థియేటర్స్ మూత పడటంతో ఆ అవకాశాన్ని కోల్పోయానని, మళ్ళీ లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24 న విడుదల అవ్వడంతో మళ్ళీ అలంటి అవకాశం దొరికిందని, థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులకి, ఫాన్స్ కి కృతజ్ఞతలు తెలియ చేసారు.
End of Article