ఫెరారీ 488 తో పాటు… నాగ చైతన్య గ్యారేజిలో ఉన్న 5 సూపర్‌ కార్లు మరియు సూపర్ బైక్‌లు ఇవే..!

ఫెరారీ 488 తో పాటు… నాగ చైతన్య గ్యారేజిలో ఉన్న 5 సూపర్‌ కార్లు మరియు సూపర్ బైక్‌లు ఇవే..!

by kavitha

Ads

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య’ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలో జోష్ మూవీతో అడుగుపెట్టి, ఏమాయ చేసావే మూవీతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు.

Video Advertisement

ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న నాగ చైతన్యకు బైక్, కార్ రేసింగ్ చాలా ఇష్టం.  చైతన్య గ్యారేజిలో ఖరీదైన లగ్జరీ  అన్యదేశ్య లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. రోడ్లు ఖాళీగా ఉన్న సమయం చూసుకుని,హెల్మెట్ పెట్టుకుని నగరంలోని రోడ్ల పై  డ్రైవ్ చేయడమంటే చైతన్య  చాలా ఇష్టం. చైతన్య గ్యారేజిలో ఉన్న కార్లు, బైకులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1. ఫోర్స్చే 911:

పోర్షే 911 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన సూపర్‌కార్. ప్రస్తుత చైతన్య గ్యారేజీలో పాత 991 తరం స్పోర్ట్స్ కారు ఉంది. అతని రెడ్ కలర్ కారు.  ఈ సూపర్ 400 పీఎస్ మరియు 440 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే, 3.8-లీటర్ ఇంజన్‌తో నడిచే కారు ఉంది.

2. ఫెరారీ 488:

ఇటాలియన్ సూపర్ కార్ల తయారుచేసే కంపెనీ అయిన ఫెరారీకి చెందిన 488 GBT ఎరుపు రంగు కారు చైతన్య గ్యారేజిలో ఉంది. ఇది 3.9-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 670 Bhp శక్తిని మరియు 760 Nm యొక్క భారీ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఖరీదు దాదాపు రూ. 4.88 కోట్లు అని సమాచారం.

3. ఎంవీ అగస్టా ఎఫ్4:

చైతన్య గ్యారేజిలో గల సూపర్ బైకులలో ఎంవీ అగస్టా ఎఫ్4 ఒకటి. ఇది  2017 మోడల్. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ బైక్,ఇది శక్తిని ఉత్పత్తి చేయడానికి 998 cc ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 192 బిహెచ్‌పి మరియు 110 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది మరియు దీని ధర సుమారు రూ. 27.83 లక్షలు.

4. బీఎండబ్ల్యూ ఆర్ నైన్ టీ:

చైతన్య గ్యారేజీలో ఉన్న మరో ఖరీదైన బైక్ జర్మన్ వెహికిల్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఆర్  నైన్ టీ’.  ఈ బైక్ 1170 సీసీ, ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో 110 పీఎస్ పవర్, 116 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఖరీదు రూ. 17 -18 లక్షలు.

5. ట్రయంఫ్ థ్రక్ట్సన్ ఆర్‌:

చైతన్య గ్యారేజీలో ఉన్న మూడో బైక్ ట్రయంఫ్ సంస్థకు చెందిన థ్రక్ట్సన్ ఆర్‌.  ఇది ఎరుపు మరియు నలుపు రంగుల డ్యూయల్-టోన్ షేడ్‌లో చూడచక్కగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ 1200 సీసీ, ప్యారలల్ ట్విన్ ఇంజన్‌తో, ఇది 98 పీఎస్ పవర్, 112 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2016లో ఈ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ఖరీదు దాదాపు రూ.10.9 లక్షలు.

Also Read: “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”లో అలా చేయడమే “మైనస్” అయ్యింది…కెరియర్ క్లోజ్ అయిపోయింది అంటూ “అర్చన” కామెంట్స్.!


End of Article

You may also like