Ads
సెలెబ్రెటీలు ఎప్పుడు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉంటారనేది ఎవరు ఊహించలేము. తాజాగా నటుడు గౌతమ్ కార్తిక్ లవ్ బయట పడింది. ఎప్పటి నుండో గౌతమ్ కార్తిక్ మధ్య మంజిమా మోహన్ లవ్ నడుస్తోంది. కానీ ఇప్పుడు అది నిజం అని కన్ఫర్మ్ చేసారు.
Video Advertisement
ఇక పూర్తి వివరాలు చూస్తే.. ప్రేమ విషయాన్ని ఈ జంట అధికారికంగా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పిక్స్ ని షేర్ చేసి మంజిమా మోహన్ గౌతమ్ గురించి చెప్పారు.
గార్డియన్ ఏంజిల్ లా నువ్వు నా జీవితం లోకి వచ్చావు అని ఆమె అంది. అలానే ఎమోషనల్ గా ఒక నోట్ ని కూడా ఈమె వ్రాసింది. నా లైఫ్ లో ఇబ్బందులు వచ్చిన ప్రతీ సారి దాని నుంచి నువ్వే బయటకి తీసుకు రావడం కోసం ట్రై చేసావు అని అంది ఆమె. నువ్ నన్ను ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు… నువ్వే నాకన్నీ అని ఆమె చెప్పుకు వచ్చింది. ఫ్యాన్స్, సెలెబ్రెటీలు ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నారు.
వీళ్ళ ప్రేమ గురించి ఎప్పటి నుండో గుసగుసలు వినపడుతున్నప్పటికీ ఇప్పుడు రివీల్ చేసారు. కడల్ సినిమా తో గౌతమ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తెలుగు లో నాగ చైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేసిన విషయం తెలిసిందే. అలానే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా మంజిమ మోహన్ నటించింది. కేవలం తెలుగు లోనే కాక ఈమె తమిళ, మలయాళ సినిమాలు కూడా చేసింది.
https://www.instagram.com/p/CkYLNznSHFy/
End of Article