Ads
Thank You TRP Rating: నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో వచ్చిన ‘మనం’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ కాంబోలోనే ‘థ్యాంక్యూ’ సినిమా రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
Video Advertisement
థ్యాంక్యూ టీజర్, ట్రైలర్ లోని డైలాగ్స్, చైతన్య ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే సినిమా చూస్తే పేలవమైన కథ మరియు కథనాలతో ఆడియెన్స్ ను విసిగెత్తించేశారు. దీంతో ఈ మూవీ దారుణంగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలోనూ ఆడియెన్స్ తిరస్కరించారు. ఇటీవల నాగ చైతన్య థ్యాంక్యూ సినిమా బుల్లితెర పై కూడా పరాజయం పొందింది.జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.
End of Article