Ads
అక్కినేని కుటుంబానికి వారసుడిగా నాగ చైతన్య సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ ఉన్నా కూడా.. నాగ చైతన్య మీడియా అటెన్షన్ కి కొంచం దూరం గానే ఉంటారు. నాగచైతన్య నటించిన రెండు సినిమాలు “లవ్ స్టోరీ”, “థాంక్యూ”.. ఈ రెండు విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాల పై ఇప్పటికే అంచనాలున్నాయి.
Video Advertisement
ఈ క్రమం లో నాగ చైతన్య మరో సినిమాలో కూడా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” లో నాగ చైతన్య కూడా ఓ కీ రోల్ ను పోషించనున్నారని సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతు పతి నటించాల్సి ఉంది. అయితే.. ఈ రోల్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తో.. ఆ పాత్ర కోసం నాగ చైతన్యను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. అయితే..ఈ రూమర్ పై నాగ చైతన్య ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. దీనితో.. అక్కినేని ఫాన్స్ లో క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. అదన్నమాట సంగతి.
End of Article