Ads
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగ శౌర్య. ఇప్పుడు రంగబలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాతో పవన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : రంగబలి
- నటీనటులు : నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య.
- నిర్మాత : సుధాకర్ చెరుకూరి
- దర్శకత్వం : పవన్ బాసంసెట్టి
- సంగీతం : పవన్ సిహెచ్
- విడుదల తేదీ : జూలై 7, 2023
స్టోరీ :
ఆంధ్రప్రదేశ్ లోని రాజవరంలో ఒక సెంటర్ పేరు రంగబలి. శౌర్య (నాగ శౌర్య) కి ఆ ఊరు అంటే ప్రాణం. అదే ఊరిలో రాజులా ఉండాలి అనుకుంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ శౌర్యని షో అని పిలుస్తూ ఉంటారు. మెడికల్ షాప్ ఓనర్ అయిన శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) తన కొడుకు దారికి రావట్లేదు అని వైజాగ్ పంపిస్తారు.
అక్కడ శౌర్య ఫార్మసీ ట్రైనింగ్ కోసం మెడికల్ కాలేజ్ లో చేరినప్పుడు సహజ (యుక్తి తరేజ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. సహజ తండ్రి ముందు అంగీకారం తెలిపినా కూడా, తర్వాత శౌర్య రంగబలిలో ఉంటున్నాడు అని తెలిసి వారి ప్రేమకు అడ్డుపడతాడు. ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటి? వీరి ప్రేమ ఏమయ్యింది? పరశురామ్ (షైన్ టామ్ చాకో) ఎవరు? శౌర్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక కమర్షియల్ సినిమా అని అర్థం అయిపోతుంది. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా ఒక మామూలు కమర్షియల్ సినిమాకి కావాల్సినట్టే ఉన్నాయి. కాబట్టి కమర్షియల్ గా ఉన్నా కూడా సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటే ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే కథలో పెద్దగా కొత్తదనం లేదు.
అసలు సీన్స్ చూస్తూ ఉంటే ఎక్కడ ఒక్క కొత్త సీన్ చూస్తున్నట్టు కూడా అనిపించదు. పాత్రలు మార్చి ఏదో పాత సినిమాల్లో సీన్స్ మళ్లీ చూస్తున్నట్టు అనిపిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ సినిమా సీరియస్ గా అవుతుంది. ఇక్కడే సినిమా మీద ఆసక్తి కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. చెప్పడానికి ప్రయత్నించిన పాయింట్ ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ అవ్వదు.
ఎమోషన్స్ బాగానే ఉన్నా కూడా అవి చూపించే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరి పాత్రల్లో వాళ్ళు బానే చేశారు. కానీ సినిమా మొత్తానికి పెద్ద హైలైట్ మాత్రం సత్య. ప్రమోషన్స్ లో కూడా సత్య చాలా ముఖ్య పాత్ర పోషించారు. సినిమాలో కూడా సత్య పాత్ర చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఆ పాత్ర లేకపోతే సినిమాని ఊహించుకోవడం కూడా కష్టమేమో అనిపిస్తుంది.
తనకు ఇచ్చిన పాత్రలో ఎంత వరకు న్యాయం చేయగలరో సత్య అంత వరకు చేశారు. పాటలు అంత పెద్ద గొప్పగా ఏమీ అనిపించవు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే, అందులోనూ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ లో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- సత్య
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
- ఫ్లాష్ బ్యాక్
- సెకండ్ హాఫ్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏదో ఒక సినిమా చూద్దాం అని అనుకొని చూస్తే రంగబలి సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “సలార్” టీజర్ లో హీరో గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
End of Article