Lakshya Review: స్పోర్ట్ డ్రామా “లక్ష్య”తో నాగ శౌర్య హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!

Lakshya Review: స్పోర్ట్ డ్రామా “లక్ష్య”తో నాగ శౌర్య హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : లక్ష్య
  • నటీనటులు : నాగశౌర్య, జగపతి బాబు, కేతిక శర్మ, సచిన్ ఖేడేకర్ తదితరులు
  • నిర్మాత :నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ (నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్)
  • దర్శకత్వం : ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
  • సంగీతం : కాలభైరవ
  • విడుదల తేదీ : డిసెంబర్ 10, 2021

Video Advertisement

స్టోరీ :

తన కలని నిజం చేయడం కోసం కురుక్షేత్ర ఆర్చరీ అకాడమీలో పార్ధు (నాగ శౌర్య) జాయిన్ అవ్వడంతో ఈ సినిమా మొదలవుతుంది. రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) అతనికి సపోర్ట్ ఇస్తారు. పార్ధు గర్ల్ ఫ్రెండ్ గా రితిక (కేతిక శర్మ) పరిచయమవుతుంది. మొట్టమొదటి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి పార్ధు వెళ్తాడు. కానీ ఇంతలో పార్ధు లైఫ్ లో అనుకోని సంఘటన చోటుచేసుకుంటుంది. అప్పుడు జగపతి బాబు పార్ధుని మళ్ళీ ఆర్చరీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. చివరికి పార్ధు కష్టాలను దాటుకొని వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఎలా గెలిచాడు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఆర్చరీ స్పోర్ట్ ప్లేయర్ గా ప్రధాన పాత్రలో నాగ శౌర్య అద్భుతంగా నటించారు. జగపతి బాబు కోచ్ పాత్రలో నటించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. రొమాంటిక్ ఫేమ్ “కేతిక శర్మ” కూడా అద్భుతంగా నటించింది. ఈ స్పోర్ట్ డ్రామా మూవీ అన్ని మూవీస్ కంటే చాలా భిన్నంగా ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించారు డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్. సెకండ్ హాఫ్ లో నాగ శౌర్య 8 ప్యాక్ తో అదరగొట్టారు. కెమెరా మెన్ రామ్ వర్క్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్.

ప్లస్ పాయింట్స్ :

  • నాగ శౌర్య నటన
  • జగపతి బాబు రోల్
  • సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

  • ముందే తెలిసిపోయే కథ
  • అంతగా ఆకట్టుకోని కొన్ని స్పోర్ట్స్ సీన్స్

రేటింగ్ : 3 / 5

ట్యాగ్ లైన్ :

స్పోర్ట్ డ్రామా అయినప్పటికి భిన్నమైన కాన్సెప్ట్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకుంటుంది “లక్ష్య”.


End of Article

You may also like