“తను ఇవాల్టి నుండి నీ సమస్య..!” అంటూ… “నాగబాబు” పాత పోస్ట్..! ఏం అన్నారంటే..?

“తను ఇవాల్టి నుండి నీ సమస్య..!” అంటూ… “నాగబాబు” పాత పోస్ట్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకుని తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. కొద్ది రోజులుగా వీరి విడాకుల పై జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నారని, విడిపోయారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Video Advertisement

నిహారిక తనకు చైతన్యతో విడాకులు అయ్యాయని తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ తరువాత చైతన్య కూడా విడాకులు విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో నాగబాబు గతంలో చైతన్యను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
nagababu-niharika2020లో డిసెంబర్ లో నిహారిక, చైతన్య పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రాజస్థాన్ లో ఒక  ప్యాలెస్ లో చాలా ఘనంగా  జరిగింది. పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో సంతోషంగా కనిపించారు.  వెకేషన్స్ కు వెళ్ళిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. నిహారిక, చైతన్యల వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారని అనుకునేలోపే షాక్ ఇచ్చారు.
నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నాము అంటూ తాజాగా ఒకరి తరువాత మరొకరు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. వీరికి గత నెల జూన్ 5న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆలస్యంగా కాస్త  బయటికి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో వీరి గురించి ఎక్కువగా వార్తలు షికారు చేస్తున్నాయి. నిహారిక పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం అనంతరం చైతన్యను ఉద్దేశించి చేసిన పాత ట్వీట్ కూడా వైరల్ అయ్యింది.
నాగబాబు ఆ ట్వీట్ లో ‘ ప్రియమైన చై దాదాపు అన్ని విషయాలలోను తాను నాలాగే ఉంటుందని అందరు అంటుంటారు. ప్రపంచంలోని ప్రేమ‌నంతా ఆమె పై కురిపిస్తావని నమ్ముతున్నాను. అలాగే ఈ రోజు నుంచి త‌ను అధికారికంగా నీ స‌మ‌స్య‌గా మారిపోయింది’ అని రాసుకొచ్చారు.

Also Read: “ఈ సినిమా నచ్చింది కానీ… ఆ మంచి సినిమాలు కనిపించలేదా..?” అంటూ… “మహేష్ బాబు-రాజమౌళి” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like