తల్లిచనిపోతూ కూతురుకి చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లొస్తాయి…అనాథలుగా చిన్నారులు!

తల్లిచనిపోతూ కూతురుకి చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లొస్తాయి…అనాథలుగా చిన్నారులు!

by Anudeep

Ads

“బిడ్డా ఆ దేవుడు నా రాత సక్కగ రాయలేదు. మీ నాన్నను తీస్కపోయిండు. సత్తువ ఉన్నంతవరకు మిమ్మల్ని సాదిన..నువ్వు నా బిడ్డవైనా మంచాన పడ్డ తర్వాత నన్ను మా అమ్మ లెక్క చూసుకున్నవ్. కానీ ఏం చేసేది…ఇగ నేను బతికెటట్ట లేను…నీకు తమ్ముడు…తమ్మునికి నువ్వు. ఎవరింటికి పోవద్దు. కష్టపడి పనిచేసుకోవాలె. తమ్ముడిని మంచిగ చదివించు. అరేయ్​మల్లికార్జునా…అక్కకు పెండ్లి చేసే బాధ్యత నీదే…అక్కనైతే ఇడువకు” ఆ తల్లి చివరి సారిగా తన బిడ్డలకు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి..వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

జగిత్యాలలో గోవింద్ పల్లెకు చెందిన కమల భర్త కొలగాని గంగారెడ్డి  పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించాడు..అప్పటికి పిల్లలు చిన్నవాళ్లు. కూతురు నాగలక్ష్మి,కొడుకు మల్లిఖార్జున్ ఇద్దరి పిల్లల బాద్యత ఇక తనదే అనుకుని ఆ నాటి నుండి కూలి పనులు చేస్కుంటూ పిల్లల్ని చదివిస్తున్నది.. పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతున్నారు..అంతా సంతోషంగా ఉన్నారని విధికి కన్నుకుట్టిందేమో.. టిబి రూపంలో కమలని మృత్యువాత పడేవరకు వదల్లేదు..

మూడేండ్ల క్రితం ఆమెకు టీబీ  వ్యాధి సోకడంతో మంచాన పడింది కమల. దాంతో తొమ్మిదో తరగతి చదువుతున్న నాగలక్ష్మి కుటుంబభారాన్ని భుజాలపై వేసుకుంది..తల్లిని కన్నతల్లిలా సాకింది. కూలీ పనికి పోతూ తల్లికి వైద్యం అందిస్తూ తమ్ముడు మల్లికార్జున్ ను చదివిస్తోంది.కమల వ్యాధి ముదరడంతో కూలిడబ్బులు సరిపోక, ఒక మెడికల్ షాపులో పనికి కుదిరింది.. అక్కడ జీతం డబ్బుల బదులు తల్లికి మందులు తీసుకునేది. ఎంత కష్టపడ్డప్పటికి ఫలితం లేకపోయింది. వ్యాధి మరింత ముదరడంతో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికి కమల చనిపోయింది..

విధే భయంకరమైనదనుకుంటే సమాజం మరింత దయ, జాలి లేని కఠినమైనది..ఎక్కడ తమ ఇంట్లో చనిపోతుందో అని ఇల్లు ఖాలి చేయమని ఇంటి ఓనర్ ఒత్తిడి ఒకవైపు, క్షీణిస్తున్న తల్లి ఆరోగ్యం ఒకవైపు ఆ పసిహృదయాలు ఎంత తల్లడిల్లి ఉంటాయో..అయినా బాధనంతా గుండెల్లోనే దాచుకుని మరో అద్దె ఇంటికోసం వెతికి , అందులోకి మారినప్పటికి అక్కడా అదే పరిస్థితి..సామానంతా మూట గట్టుకుని ఇంటికోసం తిరుగుతుండగానే అమ్మ మాట పడిపోయింది, హాస్పిటల్ కి తీస్కెల్లేలోపే చనిపోయింది.

 

నా అన్నవాళ్లు ఎవరూ లేక, అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాక అనాధ శవంగా మున్సిపల్  కార్మికులే కమల అంత్యక్రియలు నిర్వహించారు..చిన్నప్పుడే తండ్రి మరణం, ఇప్పుడు తల్లి మరణంతో ఆ పిల్లలు దిక్కులేని వారయ్యారు. తల్లి,తండ్రి లేక అనాధలైన ఆ పసిప్రాణాలు ఇంటి ఓనర్ రానిస్తాడో లేదో అనే భయంతో , అంగన్వాడి సెంటర్లో పనిచేసే ఆయా ఆశ్రయం ఇస్తే అక్కడ తలదాచుకుంటున్నారు.

మీ అమ్మ చెప్పిన మాటలు అక్షరసత్యాలు..”అమ్మా,నాగలక్ష్మీ నీకు తమ్ముడు, తమ్ముడికి నువ్వు..నీ రెక్కల్లో సత్తువ ఉన్నంత వరకు కష్టపడు..తమ్మున్ని చదివించు..అక్క కష్టాన్ని గుర్తించి తనకి అండగా ఉండు మల్లికార్జునా.. ఎవరూ మీ కష్టాన్ని పట్టించుకోరు, తీర్చాలని అనుకోరు..మీకు మీరే ధైర్యం, ఒదార్పు” ఇంతకి మించి ఏం చెప్పలేం..

 


End of Article

You may also like