“డైనాసర్” ని చూసాను అని అనుష్క ట్వీట్…నాగపూర్ పోలీస్ కౌంటర్ హైలైట్!

“డైనాసర్” ని చూసాను అని అనుష్క ట్వీట్…నాగపూర్ పోలీస్ కౌంటర్ హైలైట్!

by Anudeep

Ads

లాక్ డౌన్ కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటిల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ కొహ్లీ లాక్ డౌన్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాకి ముందే విదేశాల నుండి వచ్చిన వీరిద్దరూ సెల్ఫ్ క్వారంటైన్ లో కాలం గడుపుతూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు..తాజాగా అనుష్క పోస్ట్ చేసిన విరాట్ వీడియోకి నాగపూర్ పోలీసులు ఫన్నీ రిప్లై ఇచ్చారు.

Video Advertisement

లాక్ డౌన్ లో వారు ఏం చేస్తున్నారో ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేధికగా ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటున్నారు విరుష్క..సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న వీరిద్దరూ కరనాకి సంబంధించిన జాగ్రత్తలు చెప్తూ ఫ్యాన్స్ ని అలర్ట్ చేస్తూనే మరోవైపు ఫన్నీ వీడియోస్ తో ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తున్నారు..లాక్ డౌన్ పీరియడ్ గతంలో విరాట్ కి హెయిర్ కట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసిన అనుష్క,తాజాగా విరాట్ డైనోసార్ లా నడుస్తున్న వీడియోని పోస్ట్ చేసింది..

విరాట్ కొహ్లీ డైనోసార్ లా నడుస్తున్న ఫన్నీ వీడియోని పోస్ట్ చేస్తూ.. I spotted dinosaur అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది అనుష్కా శర్మ..దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తే,  నాగ్ పూర్ పోలీసులు డైనోసార్ ని పట్టుకోవడానికి రెస్క్యూ టీం ని పంపాలా?? అంటూ రిప్లై ఇచ్చారు.. నాగ్ పూర్ పోలీసులు ఇచ్చిన ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది..


End of Article

You may also like