• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

నిర్భయ దోషులను ఉరి తీశారు ఇలా..! ఆ నలుగురు ముందు రోజు రాత్రి ఏం చేసారంటే?

Published on March 20, 2020 by Anudeep

ఈ రోజు ప్రపంచ హ్యాపీనెస్ దినోత్సవం.. ప్రపంచమంతా కరోనా భయంతో హ్యాపిగా  లేదు కాని, భారతదేశం మాత్రం ఖచ్చితంగా కొద్దిగంటలు కరోనాని మర్చిపోయి, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న నిర్భయ నిందితుల ఉరిశిక్షతో ఖచ్చితంగా హ్యాపిగా ఉంది . నలుగురు నరరూప రాక్షసులని ఒకేసారి ఉరితీసిన ఘటన చరిత్రలోనే మొదటిసారి . మరి కొద్దిగంటల్లో చనిపోతాం అనగా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్లు ఏం చేశారు? చివరి కోరికగా ఏం కోరుకున్నారు? ఎలా ఉరితీశారు? వివరాలు.

నిర్భయ దోషులకి మార్చి  20న  ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది ఢిల్లీ కోర్టు . ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్లో వారిని ఉరితీయాలని నిర్ణయం. అందులో భాగంగానే ఉరిశిక్ష అమలు చేసే జైలు నెంబర్ 3కి దగ్గరలోకి జైలు అధికారులు వారిని తరలించారు . దోషులుగా నిర్ధారణ అయిన నాటి నుండి శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వారిలో బుధవారం మాత్రం కొద్దిగా మార్పు కనపడింది. సలుగురిని వేరు వేరు సెల్స్ లో ఉంచి, సిసిటివి ద్వారా పర్యవేక్షించారు.

ఉరి తీసే తాడు రెండున్నర సెంటీమీటర్ల వ్యాసం అంటే ఒక అంగుళం, 19 అడుగుల పొడవుండే 10 తాళ్లను బీహార్ లోని బక్సార్ నుండి ముందుగానే తెప్పించారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్లు బరువుండే ఇసుక బస్తాలతో వారం రోజుల ముందు ఒకసారి, మళ్లీ గురువారం ఆ తాళ్లని పరీక్షించారు. ఒక్కొక్కిరికి రెండు ఉరితాళ్లు, అదనంగా మరో రెండు తాళ్లని పరీక్షించి వాటిని ప్రత్యేక లాకర్ లో భద్రపరిచారు.

ఉరి శిక్ష పడిన ఖైదీలు ముకేష్ సింగ్ , అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా , వినయ్ శర్మలకు ప్రతిరోజులాగే ఒకరితర్వాత ఒకరికి వేర్వేరుగా వైధ్య పరీక్షలు చేశారు. నలుగురూ వారి చివరి కోరిక చెప్పకపోవడం విశేషం, అంతేకాదు నలుగురిలో కూడా భయం కాని, బాధ కాని , పశ్చాత్తాపం కాని ఏ భావాలు కనిపించలేదు.వీలునామా రాసే అవకాశం ఉన్న వినియోగించుకోలేదు. కనీసం భోజనం కూడా చేయకుండా , రెండు సార్లు మంచినీళ్లు తాగి సరిపెట్టుకున్నారు.

తెల్లవారితే శుక్రవారం ఉదయం 5.30కి ఉరి పడుతుందనగా, గురువారం రాత్రి నలుగురూ నిద్రపోలేదని సమాచారం. జైలు నియమాల ప్రకారం ఉదయం 2.30కి  నలుగురిని నిద్రలేపారు. 2.40 ని. కి స్నానం చేయవలసిందిగా చెప్తే, నలుగురూ అన్యమనస్కంగానే స్నానం ముగించారు.

జైలు SP, DSP, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీలు ఉన్న సెల్‌ వద్దకు చేరుకుని ,’డెత్ వారెంట్‌’లో ఉండే వివరాలతో నలుగురి వివరాలు పోల్చి చూసుకున్నారు. తరువాత ఈ ఖైదీలకు వారి మాతృభాష హిందీలో ‘వారు చేసిన నేరం ఏమిటి..?’ విధించిన శిక్షకు సంబంధించిన తీర్పు, అమలు వారెంట్‌ను చదివి వినిపించారు.

తెల్లవారుజామున 3గంటలకు ఖైదీలకు అల్పాహారం అందించగా,నలుగురూ నిరాకరించారు. ‘ఏదైనా మతపరమైన పుస్తకం కావాలా..’అని అధికారులు ఈ నలుగురిని అడిగినా కూడా ఎలాంటి సమాధానం లేదు, ప్రార్ధనలు చేసుకునే అవకాశం ఉన్నా వారు అలాంటిదేం చేయలేదని, లోపలోపల భయపడుతూ ఉన్నట్టు సమాచారం.

డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో ‘సెల్‌’లోనే ఖైదీల చేతులకు వెనక నుంచి బేడీలు వేశారు. ఒకొక్క ఖైదీని ఇద్దరు వార్డెన్‌లు భుజాలను పట్టుకొని ‘ఉరి కంభం’ వైపు నడిపించారు. ఈ ఖైదీలకు ముందు వైపు ఇద్దరు వార్డెన్‌లు, వెనుక వైపు ఇద్దరు వార్డెన్‌లు ప్రొటోకాల్ ప్రకారం జరిగింది. ఈ సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు హెడ్‌ వార్డెన్, మరో ఆరుగురు వార్డెన్‌లు కూడా ఉన్నట్టు సమాచారం.

ఉరికంభం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్, వైద్య అధికారి సిద్ధంగా ఉన్నారు. ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్‌కు వివరించారు. తరువాత ఈ నలుగురు ఖైదీలను తలారీకి అప్పగిస్తారు. ఖైదీలను ఉరి కంభం కింద నిల్చొబెట్టే వరకు వార్డెన్‌లు ఆ నలుగురు ఖైదీల చేతులు పట్టుకొనే ఉన్నారు.  ఉరికంబం ఎక్కించి, ఉరి తీసేప్పుడు కాళ్ళు కదలకుండా రెండు కాళ్ళను చిన్న తాడుతో గట్టిగా కట్టారు. తర్వాత ముఖాలకి నల్లటి ముసుగులు వేశారు. అయితే అరవకుండా నోటిలో గుడ్డలు పెట్టడం, నోటిని మూయటం కానీ చేయలేదు.

సరిగ్గా సమయం ఉదయం 5.30 ని . కి. మేజిస్ట్రేట్ టైం చూసుకొని.. సంకేతం ఇవ్వగానే, ఆ నలుగురు ఖైదీల కాళ్ల కింద ఉన్న తలుపులు తెరుచుకునేలా తలారి ‘లీవర్‌’ ను లాగాడు. ఆ నలుగురి మెడకు ఉరితాడు బిగిసింది. 14 నుంచి 16 నిమిషాల పాటు వారి శరీరాల కదలిక ఆగింది. అరగంట వరకు ఆ ఖైదీల శరీరాన్ని అలాగే ఉంచి, తర్వాత ఖైధీ మరణించినట్టుగా వైద్యాధికారి ధ్రువపరిచారు. ఆ విషయాన్ని హోం శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేశారు.

దేశవ్యాప్తంగా ఎదురు చూసిన ఒక ఘట్టానికి తెరపడింది. నిర్భయ దోషులకి శిక్ష పడింది. ఇదంతా జరిగిన ఖైదీల కుటుంబ సభ్యులెవరూ జైలు పరిసర ప్రాంతాలకు రాలేదు. నిర్భయ తల్లిదండ్రులు,దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఆ తల్లిదండ్రులు పడిన నరకయాతనకు ఇప్పటికైనా న్యాయం జరిగింది.

దోషులని ఉరి తీసిన తర్వాత నిర్భయ తల్లి మాట్లాడుతూ “ఆలస్యంగా అయినా సరే మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను. న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం పెరిగింది. నిర్భయ దోషులను ఉరి తీయడం వలన ఈ దేశంలోని తల్లిదండ్రులకి కూడా న్యాయం జరిగింది. . మా అమ్మాయికే కాదు , ఇకపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరి తరపున పోరాడతాం అని అన్నారు.

“నిర్భయ దోషులకి అనేక సార్లు శిక్షలు పడినప్పటికి, తప్పించుకుంటూ వచ్చారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో ఎన్ని లొసుగులున్నాయో అవన్ని బయటికి వచ్చాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ భవిష్యత్లో ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన సత్వరంగా శిక్షపడేలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తండ్రి బద్రినాధ్ సింగ్.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!
  • ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?
  • చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే… ఈ ఐదింటి వెనుక వుండే రహస్యం తెలుసుకోవాల్సిందే..!
  • నాగచైతన్య పెంపకంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అమల.. వాళ్ళ అమ్మ దగ్గర పద్ధతిగా పెరిగాడంటూ..!!
  • బడి నుండి ఆమెని గెంటేసినా.. ఆమె మాత్రం చదువులో వెనుకపడలేదు…ఈ విద్యార్థి కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions