1993 మిస్ ఇండియా కాంటెస్ట్ ఫైన‌ల్ లో న‌మ్ర‌త ను అడిగిన వింత ప్రశ్న ఇదే…ఆమె సమాధానం ఏంటంటే.?

1993 మిస్ ఇండియా కాంటెస్ట్ ఫైన‌ల్ లో న‌మ్ర‌త ను అడిగిన వింత ప్రశ్న ఇదే…ఆమె సమాధానం ఏంటంటే.?

by Mohana Priya

Ads

మిస్ ఇండియా. సాధారణంగా ఈ పదం, లేదా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పదాలు వినగానే ఇవన్నీ అందానికి సంబంధించిన పోటీలు అనుకుంటాం. కానీ ఈ పోటీల్లో అందం అనేది కొంతవరకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. తెలివి, వ్యక్తిత్వం, కాన్ఫిడెన్స్, టాలెంట్ ఇవన్నీ కూడా చూసి మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్ ఇస్తారు.

Video Advertisement

సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ఊర్వశి రౌతెలా, ప్రియాంక చోప్రా, జుహీ చావ్లా, రకుల్ ప్రీత్ సింగ్, మీనాక్షి శేషాద్రి, దియా మీర్జా ఇలా ఎంతో మంది నటులు ఇలాంటి కాంటెస్ట్ లలో పాల్గొన్నారు. అందులో కొంత మంది టైటిల్స్ గెలుచుకోగా, కొంత మంది పార్టిస్పెంట్స్ గా నిలిచారు. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన వారిలో నమ్రతా శిరోద్కర్ ఒకరు.

ఈ పోటీలలో కంటెస్టెంట్స్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్లకి టైటిల్స్ ఇస్తారు.  అందులో భాగంగా నమ్రత శిరోద్కర్ ని ప్రశ్న అడిగిన వీడియో యూట్యూబ్ లో ఉంది. అందులో ముగ్గురు కంటెస్టెంట్స్ కి “కోడి ముందా? గుడ్డు ముందా? ప్రూవ్ చేయండి” అనే ప్రశ్నకు సమాధానం రాయమన్నారు. ఈ ప్రశ్నకి నమ్రత “కోడి. ఎందుకంటే కోడి లేకపోతే గుడ్డు అనేది అసలు ఉండదు” అని సమాధానం చెప్పారు.

అలాగే నమ్రత సోదరి, శిల్పా శిరోద్కర్ ఈ పోటీల్లో, థర్డ్ రౌండ్ లో, టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో నమ్రత ని అడిగిన ప్రశ్న, అందుకు నమ్రత చెప్పిన జవాబు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఒకవేళ మీరు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మీ బెడ్ మీద కౌంట్ డ్రాకులా (డ్రాకులా నవలలో ఒక క్యారెక్టర్) ఉంటే మీరేం చేస్తారు?” అని అడిగారు. అందుకు నమ్రత “ముందు భయపడతాను. తర్వాత దానితో స్నేహం చేస్తాను” అని చెప్పారు.

https://www.instagram.com/tv/CDN1cG0lNwo/?utm_source=ig_web_copy_link

నమ్రతా శిరోద్కర్ ఎన్నో హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో వంశీ, అంజి సినిమాల్లో నటించారు. అలాగే కన్నడలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమాలో కూడా నటించారు నమ్రత. నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు.


End of Article

You may also like