“లక్ష్మీ పార్వతి వల్ల మంచి జరగలేదు..! మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!

“లక్ష్మీ పార్వతి వల్ల మంచి జరగలేదు..! మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!

by Harika

Ads

నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఎలా ప్రతి ఒక్కరు… ఎవరికి తగ్గ ఇమేజ్ ను వారు క్రియేట్ చేసుకొని ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే నందమూరి వంశం నుండి మరో హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు… ఆయనే నందమూరి చైతన్య కృష్ణ.ఈయన గతంలో 2003లో ధమ్ అనే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. తర్వాత 20 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు.

chaitanya krishna

ఇప్పుడు బ్రీత్ అనే సినిమా తోటి మళ్ళీ ఆడియన్స్ అలరించడానికి సిద్ధమయ్యారు.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో బ్రీత్ సినిమా రాబోతుంది.ఈ సినిమాని ఆయన తండ్రి జయ కృష్ణా స్వయంగా నిర్మించారు.ప్రమోషన్స్ లో ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతన్య కృష్ణ.. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు, లక్ష్మీ పార్వతిని ఇబ్బంది పెట్టారనే కామెంట్ల గురించి మాట్లాడారు. ‘అనకూడదు కానీ..లక్ష్మీ పార్వతి రావడం వల్ల మాకు మంచి జరగలేదు. ప్రతిదానిలో ఇంటర్‌ఫియర్ అవుతుంది తను. ఆ సమయంలో పార్టీని లాగేసుకునే పనిలో ఉంది. అనకూడదు కానీ.. మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది. నేను డైరెక్ట్‌గా చెప్తాను.

చాలా మంది మావయ్య చంద్రబాబు మీద కామెంట్లు చేస్తున్నారు. అవి నిజం కాదు. పార్టీని కాపాడడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు మావయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.అది వెన్నుపోటు కాదు అని అన్నారు.ఆయనే కాదు.. మొత్తం ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మా బాబాయ్‌లు బాలకృష్ణ, హరికృష్ణ, వెంకటేశ్వరరావు మావయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టేకోవర్ చేసుకోవడంపై చైతన్య కృష్ణ వ్యాఖ్యానించారు.

watch video :

Also Read:ఈ నటి చెప్పింది బాలకృష్ణ సినిమా గురించేనా… రూమ్ కి వెళ్ళను అనడంతో..? అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like