సినిమా కోసం ఇంతటి సాహసం ఏ హీరో చేయలేరు…ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టిన నందమూరి హరికృష్ణ.!

సినిమా కోసం ఇంతటి సాహసం ఏ హీరో చేయలేరు…ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టిన నందమూరి హరికృష్ణ.!

by Harika

Ads

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త ట్రెండ్ అవుతుందో ఊహించడం చాలా కష్టం. ఒకప్పుడు లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హరికృష్ణ చేసిన ఒక సీన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే హరికృష్ణ వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా అప్పుడు ప్రేక్షకుల హృదయాలని గెలుచుకోవడమే కాకుండా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టింది.

Video Advertisement

harikrishna

అయితే ఈ సినిమాలో ఒక సీన్ కోసం హరికృష్ణ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టాడంట. సినిమాలో ఒక సీన్ లో హరికృష్ణ కారు, విలన్ జయప్రకాశ్ రెడ్డి జీపు రైల్వే ట్రాక్ పై మధ్యలో ఆగుతాయి. ట్రైన్ రావడంతో జయప్రకాష్ రెడ్డి ఆ తర్వాత హరికృష్ణ ముందుకు వచ్చేలాగా సీన్ ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో కారు స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా స్టార్ట్ కాలేదంట సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా జీపు దిగి వెనక్కి వచ్చి తప్పించుకుంటారు.

అయితే హరికృష్ణ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఎదురుగా ట్రైన్ వస్తున్నా పట్టించుకోకుండా జీపు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించి మూడో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడంట. ఈ సీన్ తర్వాతే మగాడు అన్నాక తెగింపు ఉండాలి రా. చావుకు మనం భయపడకూడదు చావే మనల్ని చూసి భయపడాలి.. అనే డైలాగ్ ని చెపుతారు హరికృష్ణ.

నిజంగానే ఈ డైలాగ్ హరికృష్ణ కి సూట్ అవుతుందని, ఆయనకి ఆ తెగింపు ఉందని నెటిజన్ లు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఆడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్లు పెడుతున్నారు. భౌతికంగా హరికృష్ణ మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా, ఇలాంటి చేనులను గుర్తు చేసుకోవటం ద్వారా నిత్యం అభిమానుల గుండెల్లో కొలువుంటారు నందమూరి హరికృష్ణ.

 


End of Article

You may also like