ఈ నందమూరి హీరో సినిమాలకి దూరం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా.? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.?

ఈ నందమూరి హీరో సినిమాలకి దూరం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా.? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.?

by Mohana Priya

Ads

మన ఇండస్ట్రీలో ఎంతో మంది బయట నుంచి వచ్చిన హీరోలు ఉంటారు. అలాగే తమ కుటుంబం ద్వారా సినిమాల్లోకి వచ్చిన నటులు కూడా ఉంటారు. ఎలా వచ్చినా కానీ, ఎంతో కష్టపడి వాళ్ళ నటనతో ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించుకుంటారు. అలా ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి నందమూరి కుటుంబానికి చెందినవారు.

Video Advertisement

Nandamuri Hero Kalyan Chakravarthy

నందమూరి తారక రామారావు గారి తమ్ముడు అయిన త్రివిక్రమ రావు గారి కొడుకు కళ్యాణ్ చక్రవర్తి. చిన్నతనం నుండి కళ్యాణ్ చక్రవర్తి నటుడు అవ్వాలని అనుకున్నారట. 1986 లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కళ్యాణ్ చక్రవర్తి.

Nandamuri Hero Kalyan Chakravarthy

ఆ తర్వాత ఇంటి దొంగ, తలంబ్రాలు, మామ కోడళ్ళ సవాల్, మారణహోమం, రౌడీ బాబాయ్, ప్రేమ కిరీటం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి చివరిగా 2003 లో విడుదలైన కబీర్ దాస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు.

Nandamuri Hero Kalyan Chakravarthy

అందుకు కారణం ఏంటో ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ కొంత మంది, కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం, ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు అయిన హరీన్ చక్రవర్తి కూడా ప్రాణాలను కోల్పోవడం, అలాగే త్రివిక్రమ రావు గారికి గాయాలు అవ్వడంతో కళ్యాణ్ చక్రవర్తి మనస్తాపానికి గురయ్యారు అని, ఆ షాక్ నుండి తేరుకోలేకపోయారు అని అన్నారు.

Nandamuri Hero Kalyan Chakravarthy

kalyan chakravarthy in kabir das movie

ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. త్రివిక్రమ రావు గారిని చూసుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి. తర్వాత సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి తరలివచ్చినా కూడా తన కుటుంబం మొత్తం హైదరాబాద్ కి వచ్చినా కూడా తన తండ్రితో పాటు కళ్యాణ్ చక్రవర్తి చెన్నైలోనే ఉండిపోయారు. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ హైదరాబాద్ కి తిరిగి రాలేదు. చెన్నైలోనే వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయారు.


End of Article

You may also like