Ads
Hai Nanna OTT Release:నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తండ్రి కూతుర్ల మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.శృతిహాసన్ కీలక పాత్ర పోషించింది.
Video Advertisement
ఈ సినిమాతో శౌర్యువ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు. మంచి ఎమోషనల్ సినిమాగా హాయ్ నాన్న గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ మూవీ జనవరిలో ఓటీటీ లో రిలీజ్ కాబోతోంది.
హాయ్ నాన్న డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. థియేటర్‌లో రిలీజైన నలభై రోజుల తర్వాత హాయ్ నాన్నను ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి అనుగుణంగా హాయ్ నాన్న సినిమా జనవరి 19 లేదా జనవరి 26 నుంచి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతున్నారు.
థియేటర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటిటి లో కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని అంటున్నారు
End of Article