హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా…?

హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా…?

by Mounika Singaluri

నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ గతవారం విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తండ్రి కూతుర్ల మధ్య వచ్చే అనుబంధాన్ని ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు. ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కట్టిపడేస్తున్నాయి. ఈ సినిమా హిట్ దిశగా దూసుకు వెళ్తుంది. అయితే ఈ సినిమా దర్శక శౌర్యువ్ ఏంటో ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలుసా…! అతను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా…!

Video Advertisement

హాయ్ నాన్నలో ఎమోషనల్ సీన్స్ సెంటిమెంట్ సీన్స్ చూసి అందరూ దృష్టి దర్శకుడు పై పడింది. ఎవరి దర్శకుడు అంటూ ఆరాల తీయడం మొదలుపెట్టారు. ఆయనకిదే ఫస్ట్ సినిమా అని తెలిసి చాలామంది షాక్ అయ్యారు కూడా.

hi nanna director shouryuv

అయితే ఈ సినిమా దర్శకుడు శౌర్యువ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎనిమిది సంవత్సరాలు అయిందంట. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వద్ద అసిస్టెంట్ రైటర్ గా పని చేశాడు. జాగ్వార్, బజరంగీ భాయిజాన్ 2, RRR వంటి చిత్రాలకు రైటర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే ఒక హిందీ ఫిలిం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. తమిళ అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మ సినిమాకి కూడా ఈయన పని చేశారు. తర్వాత కథలు రాసుకోవడం అనుకోకుండా ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవడం ఈ సినిమా పట్టాలెక్కడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఫస్ట్ సినిమా తోనే హిట్టు కొట్టి ఇండస్ట్రీ చూపుని తన వైపు తిప్పుకున్నారు


You may also like

Leave a Comment