Ads
ఈ సంవత్సరం దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టిన హీరో నాని. నాని తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు ఇదే విధంగా నాని శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : హాయ్ నాన్న
- నటీనటులు : నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా.
- నిర్మాత : మోహన్ చెరుకూరి (cvm), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
- దర్శకత్వం : శౌర్యువ్
- సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
- విడుదల తేదీ : డిసెంబర్ 7, 2023
స్టోరీ :
విరాజ్ (నాని) ముంబైలో ఒక పెద్ద సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్. సొంతంగా ఒక ఫోటో స్టూడియో కూడా నడుపుతూ ఉంటాడు. విరాజ్ కూతురు మహి (బేబీ కియారా ఖన్నా) తో కలిసి ఉంటూ ఉంటాడు. అయితే మహికి సమస్య ఉంది అని తెలియడంతో విరాజ్ మహిని ఇంకా బాగా చూసుకుంటాడు. తండ్రి ఎంత బాగా చూసుకున్నా కూడా మహి తన తల్లిని మిస్ అవుతూ ఉంటుంది. తన తల్లి గురించి ఎన్ని సార్లు చెప్పమన్నా కూడా విరాజ్ చెప్పడు.
దాంతో అలిగి బయటికి వెళ్లిపోయిన మహికి యష్న (మృణాల్ ఠాకూర్) కలుస్తుంది. ఆ తర్వాత విరాజ్ కి కూడా మహి ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ఇంక తప్పక మహి తల్లి గురించి చెప్పడం మొదలు పెడతాడు. అసలు మహి తల్లి ఎవరు? వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? విరాజ్, యష్న ఎప్పుడు ప్రేమించుకున్నారు? అసలు యష్న కథ ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
నాని అంటే అన్ని రకాల పాత్రలు చేయగలుగుతారు. కానీ నాని అంటే మాత్రం ఎమోషనల్ పాత్రలకి పెట్టింది పేరు. నాని ఎమోషన్స్ ని తెర మీద చాలా సహజంగా చూపిస్తారు. ఇలాంటి స్పెషాలిటీ ఉన్న నటులు ఈ కాలంలో ఉండడం చాలా తక్కువ ఏమో. నాని తెర మీద ఏడుస్తుంటే నిజంగానే ఏడుపొస్తుంది. అంత బాగా నటిస్తారు. అయితే ఈ సినిమా అలాంటి ఎమోషన్స్ ఉన్న సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అర్థం అయిపోయి ఉంటుంది. సినిమా మొత్తం అలాగే ఉంటుంది.
అటు సరదాగా సాగుతూనే, ఇటు ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకున్నారు. సినిమాలో కొన్ని సర్ప్రైజ్ స్పెషల్ పాత్రలు కూడా ఉన్నారు. వారిని తెర మీద చూస్తేనే బాగుంటుంది. ఇంక కథ విషయానికి వస్తే ఇది ఒక సింగిల్ పేరెంట్ కథ. ఆ వ్యక్తి జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికి ప్రయత్నించారు. అక్కడక్కడ కొన్ని ట్విస్ట్ లతో కథని కొంచెం కొత్తగా చూపించారు. చాలా వరకు కథ ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది. కానీ టేకింగ్ బాగుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. అసలు నటీనటుల ఎంపిక ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. నాని ఒక రకంగా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసారు. ఈ పాత్రకి తాను 100% ఇచ్చారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా సీతారామం తర్వాత అంత మంచి గుర్తుండిపోయే పాత్ర చేశారు. బేబీ కియారా కూడా చిన్న వయసు అయినా కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా నానికి, కియారాకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి.
అలాగే మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన జయరాం, ప్రియదర్శి, ఒక స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించిన అంగద్ బేడి కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. పాటలు బాగున్నాయి. ఒకటి, రెండు పాటలు చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ మరొక ప్లస్ పాయింట్ అవుతుంది.
కానీ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం నిడివి కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే చాలా సాగదీసినట్టు ఉంటాయి. ఎమోషన్స్ తెరపై చూపించాలి. కాకపోతే మరి ఇంత ఎక్కువగా అయితే కాదు ఏమో అనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- ఎమోషనల్ సీన్స్
- పాటలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్టుగా ఉన్న సెకండ్ హాఫ్
- ల్యాగ్ అనిపించే లాగా ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
చిన్న చిన్న విషయాలని పక్కన పెడితే ఈ సినిమాలో పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు ఏమీ లేవు. ఫ్యామిలీ ఆడియన్స్ ని అయితే ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. నాని నటించిన సినిమాల్లో, బెస్ట్ సినిమాలు అని చెప్పుకోవాల్సి వస్తే అందులో ఒక సినిమాగా హాయ్ నాన్న సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఓటిటి లోకి వచ్చిన 800 మూవీ…. ఫ్రీగా చూడవచ్చు… ఎందులో అంటే…?
End of Article