ఓటిటి లోకి వచ్చిన 800 మూవీ…. ఫ్రీగా చూడవచ్చు… ఎందులో అంటే…?

ఓటిటి లోకి వచ్చిన 800 మూవీ…. ఫ్రీగా చూడవచ్చు… ఎందులో అంటే…?

by Mounika Singaluri

Ads

శ్రీలంక క్రికెట్ టీం లో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘800’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎందులో స్ట్రీమ్ అవుతుంది అనే పూర్తి వివరాలు చూడండి…శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సినిమా ఎన్నో ఒడిదుడుకులు కూడా నడుమ షూటింగ్ పూర్తి చేసుకుంది.

Video Advertisement

ముందుగా ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా అనుకుని సినిమాను మొదలు పెట్టారు. అయితే తమిళనాడు కి శ్రీలంకకి ఉన్న విభేదాల కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించకూడదంటూ తమిళనాడులో వివాదం రేగింది. ఆ వివాదం కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మేకర్స్ ఈ సినిమాని మళ్లీ వేరే నటుడితో రూపొందించారు. అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 6న రిలీజ్ అయింది. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది.800’ మూవీ ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. సబ్‍స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగానే జియో సినిమా ప్లాట్‍ఫామ్‍లో ఈ సినిమా చూడొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.

800 సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రను మధుర్ మిట్టల్ పోషించారు. మురళీధరన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, క్రికెటర్‌గా ఎదిరిన తీరు, కెరీర్లో ఒడిదొడుకులను ఈ చిత్రంలో కళ్ళకి కట్టినట్టు చూపించారు.800 చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. వివేక్ రంగాచారి నిర్మించగా ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లతో చరిత్ర సృష్టించగా.. ఆ సంఖ్యనే ఈ మూవీ టైటిల్‍గా పెట్టారు. ముత్తయ్య మురళీధరన్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ఈ సినిమా పైన ఆసక్తి చూపిస్తున్నారు. జియో సినిమాలో మంచి వ్యూయర్షిప్ సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:సెహ్వాగ్ ను అవుట్ చేయడం అంత ఈజీ నా…


End of Article

You may also like