ఎట్టకేలకి OTT లోకి వచ్చిన ఈ సంవత్సరం బెస్ట్ సినిమా..! అసలు ఏం ఉంది ఇందులో..?

ఎట్టకేలకి OTT లోకి వచ్చిన ఈ సంవత్సరం బెస్ట్ సినిమా..! అసలు ఏం ఉంది ఇందులో..?

by Harika

Ads

ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించాయి. అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో మొదటిగా గుర్తొచ్చే సినిమా ప్రేమలు. ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. మలయాళం సినిమా అయినా దీన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. సినిమాలో చాలా వరకు హైదరాబాద్ లోనే సాగుతుంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. నస్లెన్ కె గఫూర్, మమిత బిజు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి గిరీష్ ఏ డి దర్శకత్వం వహించారు.

Video Advertisement

premalu movie review

రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు. ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ తో కలిసి నిర్మించిన ఈ సినిమాకి విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఇది ఒక యూత్ ఫుల్ ప్రేమ కథ గా రూపొందింది. ఇంట్లో గొడవలు పడలేక ఒక అబ్బాయి హైదరాబాద్ కి వచ్చి, ఇక్కడ ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి ఎలాంటి అబ్బాయిని అయితే కోరుకుంటుందో ఆ లక్షణాలు హీరోలో ఉండవు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది.

premalu movie review

అసలు ఇలాంటి స్టోరీ ఉన్న సినిమాలు చాలా చూశాం. కానీ టేకింగ్ బాగుంటుంది. ప్రేక్షకులు అప్పుడప్పుడు లైట్ హార్టెడ్ సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. ఈ సినిమా కూడా అలాంటిదే. సోషల్ మీడియా రిఫరెన్స్ లు కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. 90స్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ రాశారు. ఇటీవల వచ్చిన ఏ ఒక్క సోషల్ మీడియా రిఫరెన్స్ ని కూడా వదలలేదు. అంత బాగా అన్నీ కవర్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇవాళ నుండి ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా కామెడీ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : సుమ డాన్స్ వీడియోస్ లో ఈయన బాగా హైలైట్ అవుతారు..! ఈ వ్యక్తి ఎవరంటే..?


End of Article

You may also like