Sundaram Master OTT: లోకి వచ్చిన కొత్త కామెడీ మూవీ చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

Sundaram Master OTT: లోకి వచ్చిన కొత్త కామెడీ మూవీ చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

Sundaram Master OTT: లోకి వచ్చిన కొత్త కామెడీ మూవీ చూశారా..?

by Mohana Priya

Ads

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, ఆ తర్వాత సినిమాల ద్వారా పాపులర్ అయిన నటుడు హర్ష అలియాస్ వైవా హర్ష. యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ షార్ట్ ఫిలింలో హర్ష చెప్పిన డైలాగ్స్ ని ఇప్పటికి కూడా మీమ్స్ లో వాడుతారు. అంత ఫేమస్ అయ్యింది ఆ షార్ట్ ఫిలిం. తర్వాత సినిమా అవకాశాలు కూడా రావడంతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు కేవలం కామెడీ పాత్రల్లో మాత్రమే హర్ష నటించారు. కానీ ఇప్పుడు కామెడీ పాత్రలతో పాటు, కథ ముందుకి వెళ్ళడానికి తోడ్పడే ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తున్నారు.

Video Advertisement

ఇటీవల హీరోగా కూడా నటించారు. ఆ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. ఆ సినిమా పేరే సుందరం మాస్టర్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చింది. ఆహాలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని, హీరో మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు కలిసి నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహించారు. దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించారు. సుందరం అనే ఒక వ్యక్తి టీచర్ గా పని చేస్తూ ఉంటాడు.

డీఈఓ అయితే కట్నం ఎక్కువ వస్తుంది అనే ఆశతో, ఒక ఊరికి వెళ్లి అక్కడ ఒక పని చేస్తే, డీఈ ఓగా ప్రమోషన్ ఇప్పిస్తాను అని ఆ ఏరియా ఎమ్మెల్యే చెప్పడంతో, కట్నం కోసం అయన చెప్పిన పనికి ఒప్పుకుంటాడు. అప్పుడు మిరియాలమిట్ట అనే ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. కామెడీతో సమాజానికి ఇంత మంచి మెసేజ్ ఇద్దాం అనే కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీద ఈ సినిమా రూపొందించారు. ఒక్కసారి అయితే తప్పకుండా చూసే సినిమా ఇది. అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుంది. ఆరోగ్యకరమైన కామెడీతో నవ్విస్తుంది.

ALSO READ : ఈ సోషల్ మీడియా స్టార్ కూతురు చాలా ఫేమస్ నటి అని తెలుసా..? ఎవరంటే..?


End of Article

You may also like