“నవీన్ చంద్ర” నటించిన ఈ కొత్త వెబ్ సిరీస్ చూశారా..? ఎలా ఉందంటే..?

“నవీన్ చంద్ర” నటించిన ఈ కొత్త వెబ్ సిరీస్ చూశారా..? ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

అందాల రాక్షసి సినిమాతో హీరోగా అడుగు పెట్టి, ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న హీరో నవీన్ చంద్ర. నవీన్ చంద్ర కేవలం హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా, పాత్రకి ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు. ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా నటించిన ఒక వెబ్ సిరీస్ నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ విడుదల అయ్యింది. కానీ ఇది తెలుగు సిరీస్ కాదు. ఈ సిరీస్ తమిళ్ లో రూపొందించారు. తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఈ సిరీస్ పేరు ఇన్స్పెక్టర్ రిషి.

Video Advertisement

naveen chandra inspector rishi amazon prime review telugu

ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, తమిళనాడులో ఉన్న తైంకాడు అనే ప్రాంతంలో వరుసగా కొంత మంది చనిపోతూ ఉంటారు. దాంతో ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఇన్స్పెక్టర్ రిషి నందన్ (నవీన్ చంద్ర) వస్తాడు. రిషి టీంలో అతనితో పాటు ఇన్స్పెక్టర్లు అయిన అయ్యన్నార్ (కన్నా రవి), చిత్ర (మాలినీ జీవరత్నం) కూడా ఉంటారు. క్యాథీ (సునైనా ఎల్లా), సత్య నంబీషన్ (శ్రీకృష్ణ దయాల్), ఇర్ఫాన్ (కుమారవేల్) అటవీ శాఖ అధికారులు. వీళ్లు కూడా రిషికి ఈ కేస్ విషయంలో సహాయం అందిస్తారు. అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా వనరచ్చి అనే వనదేవత ఇలా చేస్తున్నారు అని నమ్ముతారు.

naveen chandra inspector rishi amazon prime review telugu

అసలు ఏం జరుగుతోంది? ఆ మిస్టరీని బయటకి ఎలా తీసుకొచ్చారు? ఇవన్నీ మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి స్టోరీలు గతంలో చాలా సినిమాలు, సిరీస్ వచ్చాయి. కానీ ఇందులో మాత్రం హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి స్టోరీ రాసుకున్నప్పుడు ఆసక్తికరంగా ఉన్న స్క్రీన్ ప్లే కూడా ఉంటేనే చూడాలి అని అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ లో అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సిరీస్ మొదలైనప్పటి నుండి, ముగిసేంత వరకు చాలా బాగా రాసుకున్నారు. తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి సిరీస్ చూస్తున్నంత సేపు ఉంటుంది.

naveen chandra inspector rishi amazon prime review telugu

కొన్ని మాత్రం తెలిసిపోయేలాగా అనిపిస్తాయి. ఈ సిరీస్ 10 ఎపిసోడ్లతో రూపొందించారు. నందిని జేఎస్ దీనికి దర్శకత్వం వహించారు. సుఖ్‍దేవ్ లహరి నిర్మించిన ఈ సిరీస్ కి, అశ్వత్ సంగీతం అందించగా, భార్గవ్ శ్రీధర్ ఛాయాగ్రహణం అందించారు. టెక్నికల్ గా ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పనిచేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ కానీ, సినిమాలు కానీ ఇష్టపడేవారు దీన్ని అస్సలు మిస్ చేయకుండా చూడండి. తమిళ్, తెలుగు భాషలతో పాటు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ALSO READ : కల్కి 2898 AD కంటే ముందే… “దీపికా పదుకొనే” తెలుగు సినిమాలో నటించారా..? ఏ సినిమా అంటే..?


End of Article

You may also like