కల్కి 2898 AD కంటే ముందే… “దీపికా పదుకొనే” తెలుగు సినిమాలో నటించారా..? ఏ సినిమా అంటే..?

కల్కి 2898 AD కంటే ముందే… “దీపికా పదుకొనే” తెలుగు సినిమాలో నటించారా..? ఏ సినిమా అంటే..?

by Harika

Ads

ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాతో దీపిక తెలుగులో ఎంట్రీ ఇస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇది కొంత శాతం వరకు నిజమే కానీ అంతకుముందే దీపిక ఒక తెలుగు చిత్రంలో అలరించింది. బావగారూ బాగున్నారా, ప్రేమించుకుందాం రా, టక్కరి దొంగ, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ. ఆయన రణ్‌దీప్‌, మృదులతో కలిసి లవ్‌ ఫర్ ఎవర్‌ అనే చిత్రాన్ని రూపొందించారు.

Video Advertisement

deepika padukone telugu movie before project k

ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్ లో దీపిక నటించింది. కానీ ఈ చిత్రం ధియేటర్ల వరకు రాలేకపోయింది. అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు ‘కల్కి’ ద్వారా దక్కనుంది దీపికా కి. తన మాతృభాష అయిన కన్నడలో ఐశ్వర్య అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దీపిక బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో ‘ఓం శాంతి ఓం’ సినిమా తీసి పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత బాజీరావు మస్తానీ, యే జవానీ హే దివానీ, రామ్ లీలా వంటి పెద్ద పెద్ద సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొడుతూ అభిమానులకు దగ్గర అయింది దీపిక.

deepika padukone telugu movie before project k

రాబ్తా, సర్కస్ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించిన దీపిక మే 9న కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది . ఈ సినిమా ఇప్పటికే చాలా మటుకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో దిశా పఠాని ముఖ్యపాత్రలో కనిపించనుంది. మొన్నే ప్రభాస్, దిశా పఠాని ల రొమాంటిక్ సాంగ్ షూటింగ్ ఒకటి ఇటలీలో పూర్తయింది. ఈ సినిమా మహాభారతం కాన్సెప్ట్ మీద ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరే ఉంది కనుక అభిమానుకు కల్కి టీం నుంచి అప్డేట్ల వర్షం కురవచ్చు. ఈ సినిమాలో ఏముందనే ఆత్రుత ప్రతి ఒక్కరికి రోజురోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. మరి దాని గురించి తెలియాలంటే కనీసం సినిమా ట్రైలర్ అయ్యే వరకు అయినా వెయిట్ చేయాల్సిందే.


End of Article

You may also like