తండ్రి కోసం ఇల్లు అమ్మాలి అనుకున్నప్పుడు ఇలా జరిగితే..? ఈ వెబ్ సిరీస్ చూశారా..?

తండ్రి కోసం ఇల్లు అమ్మాలి అనుకున్నప్పుడు ఇలా జరిగితే..? ఈ వెబ్ సిరీస్ చూశారా..?

by Mohana Priya

Ads

ఇప్పుడు వెబ్ సిరీస్ కి డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. దాంతో పెద్ద పెద్ద నటీనటులు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సినిమాలు చేసి, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తమన్నా. తమన్నా కూడా కొంత కాలం క్రితం ఒక వెబ్ సిరీస్ లో నటించారు. ఆ సిరీస్ పేరు నవంబర్ స్టోరీ. ఇంద్ర సుబ్రహ్మణియన్ దీనికి దర్శకత్వం వహించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా ఇది నడుస్తుంది. వికాటన్ టెలివిస్టాస్ దీనిని నిర్మించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. తమిళంలో రూపొందించిన ఈ సిరీస్, తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది.

Video Advertisement

 november story web series telugu

కథ విషయానికి వస్తే, అనురాధ (తమన్నా) ఒక ఎథికల్ హ్యాకర్. అనురాధ తండ్రి (జిఎం కుమార్) కి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. ఆయన ఇండియాలో ఒక పేరు పొందిన బుక్ రైటర్. ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయించాలి అంటే ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అనురాధ ఈ విషయం మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి తన ఇంట్లో ఒకరు చనిపోతారు. ఆ చనిపోయిన వ్యక్తి పక్కనే తన తండ్రి ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సిరీస్ మొత్తం కూడా సస్పెన్స్ తో నడుస్తుంది. ఇలాంటి స్టోరీస్ ఎంత బాగా రాసుకుంటే సస్పెన్స్ అంత బాగా తెర మీద కనిపిస్తుంది.

november story web series telugu

దర్శకుడు సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. టెక్నికల్ గా సిరీస్ చాలా బాగుంటుంది. ఎపిసోడ్స్ నిడివి మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి ఉంటుంది. నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. తమన్నాకి నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. అనురాధ అనే పాత్రలో తమన్నా చాలా బాగా నటించారు. మే 21వ, తేదీ 2021 లో వచ్చిన ఈ సిరీస్ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నాకి కూడా ఈ సిరీస్ చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎమోషన్స్ కూడా చాలా బాగా తెర మీద వచ్చేలాగా చూసుకున్నారు. కానీ సిరీస్ ఎండింగ్ మాత్రం కాస్త అర్ధం అయ్యి కానట్టు ఉంటుంది. కొన్ని సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తాయి.


End of Article

You may also like