ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?

by Harika

Ads

ఓటీటీలో రోజుకి ఒక కొత్త సినిమా వస్తోంది. ఎన్నో భాషల సినిమాలు ఇందులో అందుబాటులో ఉంటున్నాయి. ఎన్నో కొత్త కంటెంట్ లు అందరూ చూస్తున్నారు. సామాజిక అంశాల మీద కూడా సినిమాలు తీస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాలు చర్చలకు దారి తీశాయి. అలా ఇటీవల వచ్చిన సినిమా ఆర్టికల్ 370. యామీ గౌతమ్, ప్రియ మణి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల అయినప్పుడు చాలా గొడవలు జరిగాయి. కాశ్మీర్ లో ఉన్న ఆర్టికల్ 370 ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఈ సినిమాని జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Video Advertisement

what is article 370 and why comments on movie

ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, జూనీ హక్సర్ (యామీ గౌతమ్ ధర్) ఒక ఇంటలిజెన్స్ ఫీల్డ్ ఆఫీసర్. ఢిల్లీకి బదిలీ అవుతుంది. మరొక పక్క, ఆర్టికల్ 370 ని రద్దు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. పిఎంఓ సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ (ప్రియమణి) చాలా గ్రౌండ్‌వర్క్‌ చేస్తూ ఉంటుంది. కాశ్మీర్‌లో ఎన్ఐఏ ఆపరేషన్‌కు ప్రాతినిధ్యం వహించడానికి జూనీని నియమిస్తుంది. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది అనేది మిగిలిన కథ. సినిమా మొత్తం కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న వాళ్ళందరూ అనుభవం ఉన్న నటులు.

what is article 370 and why comments on movie

చాలా సంవత్సరాల నుండి ఎన్నో బలమైన పాత్రల్లో నటిస్తూ వచ్చారు. ఈ సినిమాలో కూడా వారి పాత్రల్లో వారు బాగా నటించారు. సినిమా చాలా చోట్ల స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఆసక్తి తగ్గకుండా సాగుతుంది. దేశానికి సంబంధించిన విషయం మీద ఈ సినిమా తీశారు. అందుకే ఆ విషయాలని ఈ సినిమాలో చాలా ఎక్కువగా చూపించారు. సినిమాలో దర్శకుడు ఎంచుకున్న అదే పాయింట్ మీద మొదటి నుండి చివరి వరకు తీశారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు.


End of Article

You may also like