Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న హీరోలలో ఆయన నెంబర్ 1 లో ఉంటారు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మహేష్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు…ఆ తరువాత సినిమాలు దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
Video Advertisement
సినిమాల నుంచి భారీగా డబ్బు సంపాదిస్తున్న మహేష్ బాబు మరోవైపు అడ్వర్టైజింగ్, బిజినెస్ వెంచర్స్ తో ఫైనాన్షియల్ గా చాలా ఎదిగిపోయారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన నాని సినిమా కూడా బాగుంటుంది.
మహేష్ బాబు చిన్నపిల్లాడిగా అయ్యిపోవడం ఇలా కథ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా లో పాటలు కూడా బాగుంటాయి. అయితే ఈ సినిమాలో ఓ పాట వుంది. ఆ పాట లో దీన్ని మీరు గమనించి వుండరు. మరి ఆ విషయాలనే ఇప్పుడు చూద్దాం. ”నాని వయసే ఇరవై ఎనిమిది” అనే పాటలో కృష్ణ గారి సినిమా పేర్లు వున్నాయి. ఈ పాట చరణం లో కృష్ణ గారు నటించిన తేనే మనసులు, నేనే నెంబర్ వన్, కురుక్షేత్రం, మోసగాళ్లకు మోసగాడిని, సింహాసనం సినిమా పేర్లు ఉంటాయి.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొదటి భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతో కన్నుమూశారు. ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే కృష్ణ గారు కూడా చివరి శ్వాస విడిచారు. ఇప్పుడు వారి లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అందరి జీవితంలోను కష్టాలు ఉంటాయి. ఇవి కామన్ ఏ. అలానే సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ లో కూడా ఫెయిల్యూర్స్ వున్నాయి. ఆయన కూడా ఆయన లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారట. పద్నాలుగు ప్లాప్స్ ని ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఏమి కృంగిపోలేదు. పాడిపంటలు సినిమా తో ఆయన వరుస ప్లాప్స్ కి చెక్ పెట్టేసారు.
https://www.instagram.com/reel/ClAsiIsJyRb/?utm_source=ig_web_copy_link
End of Article