నాచురల్ స్టార్ నాని “టక్ జగదీష్”… హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

నాచురల్ స్టార్ నాని “టక్ జగదీష్”… హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

చిత్రం : టక్ జగదీష్

Video Advertisement

నటీనటులు : నాని, రీతు వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్, డేనియల్ బాలాజీ.

నిర్మాత : సాహు గారపాటి

దర్శకత్వం : శివ నిర్వాణ

సంగీతం : తమన్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : గోపి సుందర్

విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021, (అమెజాన్ ప్రైమ్)

Nani tuck Jagadish telugu movie story review rating

టక్ జగదీష్ రివ్యూ :

భూదేవి పురంలో ఈ కథ అంతా నడుస్తుంది. జగదీష్ నాయుడు (నాని), బోస్ (జగపతి బాబు) అన్నదమ్ములు. వారి అక్కచెల్లెళ్ళు (రోహిణి, దేవదర్శిని). జగదీష్ మేనకోడలు చంద్ర (ఐశ్వర్య రాజేష్) జగదీష్ ని ఇష్టపడుతుంది. కానీ జగదీష్, గుమ్మడి వరలక్ష్మి (రీతు వర్మ) ని ఇష్టపడతాడు. జగదీష్ తండ్రి ఆదిశేష నాయుడు (నాజర్) చనిపోయిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అప్పుడు జగదీష్ ఏం చేశాడు? తన ఊరి సమస్యల్ని, అలాగే తన కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

tuck jagadish review

విశ్లేషణ :

ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కుటుంబ విలువల చుట్టూ తిరుగుతుంది అనే విషయం అర్థమైపోయి ఉంటుంది. సినిమా చాలా స్లో గా మొదలవుతుంది. చాలా వరకు అలాగే సాగుతుంది కూడా. ఎక్కడా పెద్ద పెద్ద అరుపులు కానీ, చాలా పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కానీ ఉండవు. వారి సంభాషణ అంతా కూడా మామూలుగా ఎలా మాట్లాడతారో అదే టోన్ లో నడుస్తుంది. కానీ సినిమా చూస్తున్నంత సేపు డీసెంట్ గా అలా సాగిపోతూనే ఉంటుంది. మధ్యలో సినిమా ఫ్లో ఎక్కడా డిస్టర్బ్ అవ్వదు. అలా లైటర్ నోట్ లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. అప్పటి వరకు ఉన్న పాత్రల తీరు కూడా సెకండ్ హాఫ్ లో మారుతాయి. ఒక రకంగా చెప్పాలంటే అసలు కథ అక్కడే మొదలవుతుంది.

tuck jagadish review

ఈ సినిమాకి ముఖ్య బలం మాత్రం నటీనటుల పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా నాని, జగపతి బాబు ఈ సినిమా తమ భుజాల మీద మోసారు. ఇంక మిగిలిన నటీనటులు రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, రావు రమేష్, నరేష్, దేవదర్శిని, రోహిణి, డేనియల్ బాలాజీ (ఘర్షణ ఫేమ్) కూడా తమ పాత్రల్లో బానే నటించారు. తమన్ అందించిన సంగీతం, గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకి సూట్ అయ్యేలా ఉన్నాయి. ఒకటి రెండు కంటే సినిమాలో పెద్దగా ట్విస్ట్ లాంటివేమీ ఉండవు. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ లో నాని నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఎటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, కుటుంబంతో కలిసి ఒకసారి మాత్రం సినిమా చూసేయొచ్చు.

tuck jagadish review

ప్లస్ పాయింట్స్ :

నాని, జగపతి బాబు

సినిమాటోగ్రఫీ

విలేజ్ లొకేషన్స్ ని చూపించిన విధానం

మైనస్ పాయింట్స్ :

స్లో స్క్రీన్ ప్లే

రేటింగ్ : 3 / 5

ట్యాగ్ లైన్ :

భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా చూస్తే టక్ జగదీష్ కచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ సినిమా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.


End of Article

You may also like