చంద్రబాబు నాయుడు విషయంలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. లాయర్లు వాదించడం, వారి పాయింట్ ని జడ్జి ముందు పెట్టడం, విచారణ, వాయిదా ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. ఇన్ని జరిగాక చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది.

Video Advertisement

అయితే చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు.

nara bhuvaneswari post on chandrababu naidu health

ఈ విషయంపై భువనేశ్వరి మాట్లాడుతూ ” నా భర్త ఆరోగ్యం గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. వైద్యులు జైలులో నా భర్తకి సకాలంలో వైద్యం అందించట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా భర్తకి సరైన వైద్యం అందించడంలో విఫలం అయిన కారణంగా నాకు ఆందోళనగా ఉంది. ఆయన ఇప్పటికే ఐదు కేజీల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే ఆయన కిడ్నీలకి ఇబ్బంది కలుగుతుంది.”

nara bhuvaneswari post on chandrababu naidu health

“ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. దాంతో నా భర్త ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఇవన్నీ నా భర్త జీవితానికి ఇంకా సమస్య అని కలిగిస్తున్నాయి” అంటూ రాశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా భువనేశ్వరి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు.

nara bhuvaneswari post on chandrababu naidu health

తన బాధలు చెప్పుకోవడానికి వచ్చాను అని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా భువనేశ్వరి పోరాడుతూనే ఉన్నారు. భువనేశ్వరి తో పాటు, చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా ఈ విషయంపై మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా కూడా న్యాయమే గెలుస్తుంది అని అంటున్నారు.

ALSO READ : టికెట్ లేకుండా “వందే భారత్ ఎక్స్‌ప్రెస్” ఎక్కిన పోలీస్..! కానీ ఆ తరువాత ఏం జరిగిందంటే..?