Ads
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఇటీవల తిరుపతి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన భార్య నారా బ్రాహ్మణి, చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు లోకేష్, బ్రాహ్మణి కొడుకు అయిన దేవాన్ష్ కూడా తిరుపతికి వెళ్ళాడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్లారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, కంచెర్ల శ్రీకాంత్ ,అనగాని సత్యప్రసాద్ ,పంచుమర్తి అనురాధ, ఆరణి శ్రీనివాసులు కూడా వెళ్లారు.
Video Advertisement
నారా కుటుంబం ప్రతి సంవత్సరం కూడా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఉన్న తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన వితరణకు అయ్యే మొత్తాన్ని విరాళంగా ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. తిరుమలలో ఉన్న తరిగొండ వెంగమాంబ నిత్య ప్రసాద వితరణ కేంద్ర భవనంలో కూడా విరాళం చేసినట్టు తెలిపారు. ఆ రోజు విరాళం అందించిన వ్యక్తి దేవాన్ష్ అని తెలిపారు. అక్కడ డిస్ప్లే బోర్డు మీద ఈ విషయాన్ని డిస్ప్లే చేశారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చుని, 38 లక్షల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం ట్రస్ట్ కి లోకేష్ విరాళంగా ఇచ్చారు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు అన్నదాన సత్రంలో భోజనాన్ని కూడా వడ్డించారు.
ఎంతో మంది భక్తులు తమ కుటుంబ సభ్యుల్లో పుట్టినరోజు, లేదా ఇతర మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు తిరుమలకి వెళ్లి శ్రీవారికి విరాళాలు అందజేయడం వంటివి చేస్తూ ఉంటారు. కొందరు భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేసేందుకు విరాళాలు ఇస్తారు. మరి కొందరు అన్నదాన సేవలో పాల్గొని భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. మరి కొందరు అయితే బంగారం, వెండి లేదా ఇతర ఆభరణాల రూపంలో కూడా కానుకలు అందించి, భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, దేవాన్ష్ ప్రతీ పుట్టినరోజుకి తిరుపతికి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈసారి కూడా అలాగే వెళ్లారు.
watch video :
ALSO READ : ఆ సన్నివేశాలు లేకుంటే… నితిన్ “శ్రీ ఆంజనేయం” సినిమా “హనుమాన్” కంటే పెద్ద హిట్ అయ్యుండేదా.?
End of Article