Nara Lokesh Love Story: “నారా లోకేష్-బ్రాహ్మణి” ల ప్రేమ కథ… ఎలా మొదలు అయ్యిందో తెలుసా..?

Nara Lokesh Love Story: “నారా లోకేష్-బ్రాహ్మణి” ల ప్రేమ కథ… ఎలా మొదలు అయ్యిందో తెలుసా..?

by kavitha

Ads

Nara Lokesh Brahmani Love Storyనారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. యువగళంలో భాగంగా లోకేష్  కొంత కాలం క్రితం సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిలో పర్యటించారు.

Video Advertisement

అక్కడ నారా లోకేష్ విద్యార్థులు, మరియు యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఒక యువతి బ్రాహ్మణితో వివాహం గురించి ముందుగా ఎవరు ప్రతిపాదన తెచ్చారని అడిగింది. అప్పుడు మీరేలా స్పందించారని అడిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Nara Lokesh Love Storyనారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’  పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు,  విజయవాడ నుండి  పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
Nara Lokesh Wife Name and Ageఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. వివాహం జరగడం, ఆ తరువాత జరిగింది మీకు తెలిసిందే కదా” అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ ఈ విషయాలు చెప్తున్నంతసేపు ఆ ప్రాంగణమంతా అక్కడున్న విద్యార్థులు, మరియు యువత అరుపులతో  మార్మోగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ ప్రధాని “మన్మోహన్ సింగ్”..! ఇలా అయిపోయారేంటి..?

 


End of Article

You may also like